పరగడుపున ఈ డ్రింక్ తాగితే బరువు ఈజీగా తగ్గుతారు?

Purushottham Vinay
అధిక బరువు పెరగడం చాలా ఈజీ కానీ.. తగ్గడం మాత్రం ఖచ్చితంగా చాలా కష్టం. ఒక నెల రోజులు ఏది పడితే అది తింటే.. కనీసం ఓ 10 కిలోలు అయినా ఈజీగా పెరుగుతాం. కానీ అదే 10 కిలోలు తగ్గాలంటే మాత్రం ఖచ్చితంగా చాలా కష్ట పడాల్సి ఉంటుంది.బరువు తగ్గడానికి చాలామంది ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. గంటలు గంటలు జిమ్ లో కసరత్తులు చేస్తారు. అయినా కూడా అస్సలు తగ్గరు. అటువంటి వాళ్లు ఒక చిన్న టిప్ పాటిస్తే చాలు.. వద్దన్నా కూడా ఈజీగా బరువు తగ్గుతారు.ఈ రోజుల్లో బరువు తగ్గే ప్రాసెస్ లో చాలామంది కూడా ఏది పడితే అది చేసి తమ ఆరోగ్యాన్ని చేతులారా పాడుచేసుకుంటారు. అందుకే బరువు తగ్గడం పై శ్రద్ద చూపుతూ ఆరోగ్యం కూడా బాగుండేలా చూసుకోవాలి.ఇక అప్పుడే అనారోగ్యం దరిచేరదు. అయితే అందుకోసం  మీరు పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేదు.ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ తాగితే చాలు ఆరోగ్యానికి ఆరోగ్యం ఇంకా బరువు కూడా ఈజీగా తగ్గుతారు.


ఈ డ్రింక్ కోసం మీరు ధనియాలు రెండు స్పూన్లు, కొన్ని మిరియాలు, దాల్చిన చెక్క పొడి ఒక చెంచా ఇంకా నీరు ఒక కప్పుని తీసుకోండి.ధనియాలను తీసుకొని వాటిని ఒక పాన్ లో వేసి వేయించుకోవాలి. అలాగే అందులో కొన్ని మిరియాలు వేసుకోండి. కొంచెం దాల్చిన చెక్క కలిపి మూడింటిని మిక్సీ పట్టండి. అవి మెత్తగా పొడిగా అయ్యాక దాన్ని అలాగే పక్కన పెట్టండి. ఇక ఒక గిన్నెలో కొన్ని మంచినీళ్లు పోసి వాటిని బాగా మరగబెట్టండి. ఆ నీరు మరిగాక.. అందులో రెడీ చేసి పెట్టుకున్న పొడిని కూడా వేయండి. ఇక కాసేపు మరిగించాక వడకట్టి ఆ తరువాత గోరు వెచ్చగా అయ్యాక తాగాలి. ప్రతి రోజు ఉదయం పూట పరగడుపున దాన్ని తాగాల్సి ఉంటుంది.ఇంకా అలాగే.. రాత్రి కూడా పడుకునే ముందు ఒకసారి తాగితే మంచిది . ఇలా రోజూ చేయడం వల్ల మన ఒంట్లోని కొవ్వు చాలా ఈజీగా కరుగుతుంది. దాని వల్ల బరువు కూడా చాలా ఈజీగా తగ్గుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: