జున్నుతో ఎన్ని కోట్ల లాభాలో తెలుసా?

Purushottham Vinay
జున్ను అంటే తెలియని వారు దీనిని తినని వారు అసలు ఉండరనే చెప్పవచ్చు. ఆవులు ఇంకా గేదెలు ఈనిన తరువాత వారం రోజుల పాటు మనకు ఈ జున్ను పాలు లభిస్తాయి.ఇక ఈ పాలు గోధుమ రంగులో ఉంటాయి. ఈ పాలకు బెల్లం లేదా చక్కెర అలాగే యాలకుల పొడి ఇంకా మిరియాల పొడి కలిపి జున్నును తయారు చేస్తారు. జున్ను తినడానికి చాలా రుచిగా ఉంటుంది. అలాగే జున్నును తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. జున్ను పాలల్లో ప్రోటీన్స్ ఇంకా క్యాలరీలతో పాటు ఇతర పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇక డ్రై ఫ్రూట్స్ లో ఉండే ప్రోటీన్ ల కంటే జున్ను పాలల్లో ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి. మనం జున్నును తీసుకోవడం వల్ల ప్రోటీన్ లోపం తలెత్తకుండా ఉంటుంది. జున్ను పాలల్లో చాలా ఎక్కువగా క్యాలరీలు ఉంటాయి.వీటికి పంచదార, బెల్లం కలిపి జున్నును చేయడం వల్ల క్యాలరీల శాతం అనేది మరింత పెరుగుతుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు తగిన మోతాదులో మాత్రమే దీనిని తీసుకోవాలి. జున్ను పాలను తీసుకోవడం వల్ల పొట్టలో ఉండే మంచి బ్యాక్టీరియా శాతం కూడా పెరుగుతుంది. శరీరం బలంగా ఇంకా ధృడంగా తయారవుతుంది.


అలాగే శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అలాగే జున్నును తీసుకోవడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. నిద్రలేమి సమస్య కూడా ఈజీగా దూరం అవుతుంది. రక్తం కూడా శుద్ది అవుతుంది. ఈ జున్ను పాలల్లో పోషకాలు సాధారణ పాలల్లో కంటే చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి జీర్ణశక్తి తక్కువగా ఉన్న వారు జున్నును తక్కువ మోతాదులో తీసుకుంటే మంచిది.లేదంటే మన శరీరంలో వాతం, కఫం ఇంకా కడుపు నొప్పి వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.ఇంకా అలాగే వాతం వల్ల కలిగే నొప్పులతో బాధపడే వారు కూడా దీనిని తక్కువగా తీసుకోవాలి. అలాగే జున్ను కొంతమందిలో అలర్జీలను కలిగించే అవకాశం కూడా ఉంది. ఏది ఏమైనప్పటికి జున్ను మనకు సహజ సిద్దంగా లభించే ఆరోగ్యకరమైన పదార్థం.కాబట్టి ఇది లభించినప్పుడు తప్పకుండా ఆహారంగా తీసుకోవాలి. జున్ను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. అయితే దీనిని తగిన మోతాదులో తీసుకున్నప్పుడు మాత్రమే మన ఆరోగ్యానికి మంచి మేలు కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: