వేగంగా తినడం వల్ల కలిగే అనర్ధాలు ఇవే?

Purushottham Vinay
వేగంగా తినడం వల్ల ఖచ్చితంగా ఆరోగ్యం పాడవుతుంది.ఇంకా ఊబకాయం బారిన పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వేగంగా తినడం వల్ల తిన్న తరువాత కొద్ది సమయానికే మళ్ళీ ఆకలి వేస్తుందని దీంతో మరింత ఎక్కువ ఆహారాన్ని, ఎక్కువ క్యాలరీలను తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వేగంగా తినడం వల్ల జీర్ణవ్యవస్థకు సంబంధించిన హార్మోన్ల పని తీరు దెబ్బతింటుందని కూడా నిపుణులు చెబుతున్నారు. ఇంకా అదే విధంగా వేగంగా తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ బారిన పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఇంకా అదే విధంగా వేగంగా తినే వారిలో గుండె జబ్బులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని వీరి శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తక్కువగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.అదే విధంగా వేగంగా తినడం వల్ల కడుపులో గ్యాస్, కడుపు నొప్పి, పొట్టలో వాపు ఇంకా జీర్ణ సమస్యలు వంటి వాటి బారిన పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.


అలాగే వేగంగా తినడం వల్ల పొట్టలో ఆహారం ఎక్కువ సేపు ఉంటుంది. దీంతో జీర్ణ సమస్యలు అలాగే గ్యాస్ సమస్యల బారిన పడవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అదే వివధంగా వేగంగా తినడం వల్ల గొంతు పట్టుకుపోవడం, ఉక్కిరిబిక్కిరి అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి.కాబట్టి నెమ్మదిగా ఆహారాన్ని తీసుకోవాలి. ప్రతి రోజూ కనీసం భోజనానికి ఖచ్చితంగా 20 నిమిషాల సమయం కేటాయించాలి.ఎందుకంటే 20 నిమిషాల సమయాన్ని కేటాయించడం వల్ల మన శరీరం మెదడుకు కడుపు నిండిన భావనను కలిగించే సంకేతాలను అందిస్తుంది. అందువల్ల మనం తక్కువ ఆహారాన్ని తీసుకున్నప్పటికి కడుపు నిండిన భావన కలుగుతుంది.ఇంకా అలాగే భోజనం చేసే ముందు ఆహారం  రంగును, రుచిని, వాసనను చూడాలి. ఇంకా అదే విధంగా ఆహారాన్ని చిన్న చిన్న ముద్దల రూపంలో తీసుకుని బాగా నమలాలి. ఇలా నెమ్మదిగా భోజనం చేసినప్పుడే మనం తిన్న ఆహారంలో ఉండే పోషకాలు మన శరీరానికి చాలా చక్కగా అందుతాయని వేగంగా భోజనం చేయడం అనేది అస్సలు మంచి పద్దతి కాదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: