అమితమైన బలం కోసం ఈ పండ్లు తినండి?

Purushottham Vinay
ప్రతి రోజు మన ఆహారంలో తప్పకుండా ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి.ఈ ప్రోటీన్ అనేది ఎక్కువగా జంతు సంబంధిత ఆహారాల్లో ఉంటుంది. అయితే వీటిని మాత్రం ప్రతిరోజూ అందరూ తీసుకోలేరు. జంతు సంబధిత ఆహారాలను తీసుకోలేని వారు కొన్ని రకాల పండ్లను తీసుకోవడం వల్ల వారి శరీరానికి కావల్సినంత ప్రోటీన్ లభిస్తుంది. చాలా మంది కూడా పండ్లల్లో విటమిన్స్, మినరల్స్, ఫైబర్ మాత్రమే ఉంటాయి అనుకుంటారు. కానీ పండ్లల్లో కూడా ప్రోటీన్  ఉంటుంది.ప్రోటీన్ ఎక్కువగా ఉండే పండ్లల్లో ఖచ్చితంగా జామకాయ  ఒకటి.ఎందుకంటే ఒక కప్పు జామకాయ ముక్కలల్లో 4 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ప్రోటీన్ తో పాటు వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ ఇంకా విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది. జామకాయలను తినడం వల్ల ప్రోటీన్ లతో పాటు ఇంకా ఇతర పోషకాలు కూడా మన శరీరానికి లభిస్తాయి. ఇంకా అదే విధంగా అవకాడో కూడా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఒక్కో అవకాడోలో 4 గ్రాముల ప్రోటీన్ అనేది ఉంటుంది. అలాగే దీనితో పాటు ఫైబర్, పొటాషియం, విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి6 వంటి పోషకాలు కూడా ఇందులో ఉంటాయి. దీనిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది.


ఇంకా అదే విధంగా ఒక కప్పు బ్లాక్ బెర్రీలలో 2 గ్రాముల ప్రోటీన్ అనేది ఉంటుంది. ఇవి చాలా రుచిగా ఉండడంతో పాటు వీటిని తీసుకోవడం వల్ల ఫైబర్ ఇంకా విటమిన్ సి వంటి పోషకాలు కూడా లభిస్తాయి.ఇంకా అలాగే ఒక్కో కివీ పండులో 2 గ్రాముల ప్రోటీన్ అనేది ఉంటుంది. అలాగే విటమిన్ సి, కె, పొటాషియం వంటి పోషకాలు కూడా ఇందులో ఉంటాయి. డయాబెటిస్ తో బాధపడే వారికి ఇవి చాలా చక్కటి ఆహారమని చెప్పవచ్చు. ఇంకా అదే విధంగా పీచ్ ఫ్రూట్ లో కూడా ప్రోటీన్ ఉంటుంది. ఒక కప్పు ముక్కలల్లో 2 గ్రాముల ప్రోటీన్ అనేది ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన ఇతర పోషకాలు కూడా ఈజీగా లభిస్తాయి. ఇంకా అదే విధంగా పనస కాయలో కూడా ప్రోటీన్ ఉంటుంది. 100 గ్రాముల పనస తొనలల్లో 3 గ్రాముల ప్రోటీన్ అనేది ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల రుచితో పాటు ఆరోగ్యానికి కడా చాలా మేలు కలుగుతుంది. ఇక ఈ విధంగా పండ్లల్లో కూడా ప్రోటీన్ ఉంటుందని వీటిని తీసుకోవడం వల్ల కూడా మన శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్ లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: