ఈ జ్యూస్ లు తాగండి..రోజంతా చలాకీగా ఉండండి..!

Divya
చాలా మంది ఏ చిన్న పని చేసినా ఇట్టే అలసిపోతుంటారు.రోజంతా ఎనర్జిగా ఉండాలంటే సరైనా పోషకాలు ఉన్న ఆహారాలను టిఫిన్ సమయంలో తీసుకోవాలి.ముఖ్యంగా కొన్ని రకాల జ్యూస్ లు తీసుకోవడం వల్ల సరైన న్యూట్రియాంట్స్ శరీరానికి అంది,రోజంతా చలాకీగా ఉండడానికి ఉపయోగపడతాయని వైద్యం నిపుణులు సూచిస్తూన్నారు.అలాంటి జ్యూస్ లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆకుకూరల జ్యుస్..
ఆకుపచ్చని ఆకుకూరలు, కూరగాయలతో కూడిన జ్యూస్ తీసుకోవడం వల్ల రోజంతా చలాకీగా ఉండవచ్చు.ఈ జ్యూస్ జీర్ణవ్యవస్థను సక్రమంగా పనిచేయడానికి సహాయపడుతుంది.మరియు కడుపు, ప్రేగుల కదలికను వేగవంతం చేసి,పొట్టను శుభ్రపరుస్తుంది.అంతే కాక ఇందులోని ఫ్యాటీ ఆసిడ్స్ లివర్ పనితీరును మెరుగుపరుస్తుంది.ఆకుకూరలను అధికంగా తీసుకోవడం వల్ల పొట్టలోని గ్యాస్,కడుపుబ్బరం,మలబద్ధకం వంటి సమస్యలను తొందరగా నివారించుకోవచ్చు.గ్రీన్ జ్యూస్‌లోని ప్రోటీన్లు , ప్రత్యేక యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని రోగనిరోధకశక్తిని పెంచుతాయి.ఇందులోని క్యాల్షియం ఎముకలను దృఢంగా ఉంచడానికి సహాయపడుతుంది.ఈ జ్యూస్ తాగడం వల్ల మెగ్నీషియం వంటి మినరల్స్ పుష్కలంగా అంది,కండరాల పనితీరును ప్రోత్సహిస్తాయి.ముఖ్యంగా పాలకూర జ్యూస్ త్రాగటం చాలా ఉత్తమం.
క్యారెట్ జ్యూస్..
క్యారెట్ జ్యూస్ టిఫిన్ సమయంలో తీసుకోవడానికి సరైన జ్యూస్ అని చెప్పవచ్చు.ఈ జ్యుస్ లో ఫ్లేవనాయిడ్లు మరియు కెరోటినాయిడ్స్‌ సమృద్ధిగా లభిస్తాయి.ఉదయాన్నే క్యారెట్ జ్యూస్ కి ఒక స్పూన్ తేనె కలుపుకొని త్రాగడం వల్ల శరీరానికి సరైన పోషకాలు అంది రోజంతా చలాకీగా ఉండవచ్చు.క్యారెట్ జ్యూస్ పొట్టలోని ఆమ్లాల pHని బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడి,ఎసిడిటీ మరియు అజీర్తి వంటి సమస్యలకు ఉపశమనం కలిగిస్తుంది.
బీట్‌రూట్ జ్యూస్..
రోజూ ఉదయాన్నే బీట్‌రూట్ జ్యుస్ తీసుకోవడం వల్ల, ఇందులోని ఐరన్ ఎర్రరక్తకణాలు వృద్ధి చెందడానికి సహాయపడతాయి.ఇది మీ శరీరంలో రక్త ప్రసరణను పెంచి,రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. అంతేకాక మెదడు పనితీరును కూడా మెరుగు పరుస్తుంది.ఉదయాన్నే ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల శరీర మెటబాలిజం రేటును పెంచుతుంది.మరియు ముఖం తాజాగా ఉండడానికి సహాయపడుతుంది. కావున ఉదయాన్నే ఈ జ్యూస్ లు తీసుకోవడం చాలా ఉత్తమం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: