ఇదొక్కటి తింటే చాలు మన ఆరోగ్యం సేఫ్?

Purushottham Vinay
బెల్లం రుచి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనే లేదు.బెల్లంతో చేసే తీపి వంటకాలన్నీ కూడా చాలా రుచిగా ఉంటాయి. బెల్లాన్ని తినడం వల్ల రుచితో పాటు మన ఆరోగ్యానికి కూడా చాలా మేలు కలుగుతుంది.బెల్లంలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉన్నాయి. బెల్లాన్ని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం చాలా ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. బెల్లం వల్ల మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. బెల్లాన్ని తినడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. వేసవిలో దీనిని తీసుకోవడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రతలు కంట్రోల్ లో ఉంటాయి.అలాగే బెల్లాన్ని తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య దరి చేరకుండా ఉంటుంది. ఎముకలు చాలా ధృడంగా ఉంటాయి. ఇంకా జీర్ణ సమస్యలు దూరమవుతాయి.గుప్పెడు కాకరకాయ ఆకులు, ఒక చిన్న బెల్లం ఇంకా నాలుగు లేదా ఐదు వెల్లుల్లి రెబ్బలను తీసుకుని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను రోజుకు రెండు పూటలా వారం రోజుల పాటు తీసుకోవడం వల్ల స్త్రీలల్లో నెలసరి సమయంలో వచ్చే సమస్యలు చాలా ఈజీగా తగ్గుతాయి. ఇంకా అలాగే పొడి దగ్గుతో బాధపడే వారు బెల్లం పానకంలో తులసి ఆకులు వేసి మరిగించి గోరు వెచ్చగా అయిన తాగాలి. ఇలా తాగడం వల్ల పొడి దగ్గు ఈజీగా తగ్గుతుంది. ఈ టిప్ ని పాటించడం వల్ల పొడి దగ్గు నుండి వెంటనే ఉపశమనం కలుగుతుంది.


కీళ్ల నొప్పులను తగ్గించడంలో కూడా బెల్లం మనకు చాలా బాగా సహాయపడుతుంది. కీళ్ల నొప్పులతో బాధపడే వారు అల్లాన్ని ఇంకా బెల్లాన్ని సమపాళ్లల్లో కలిపి తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి.అలాగే ఎక్కిళ్లతో బాధపడే వారు అల్లం పొడికి సమానంగా బెల్లాన్ని కలిపి తీసుకోవడం వల్ల ఎక్కిళ్లు ఈజీగా తగ్గుతాయి. రోజూ ఒక బెల్లం ముక్కను తినడం వల్ల రక్తనాళాల ఆరోగ్యం కూడా బాగా మెరుగుపడుతుంది.అలాగే నెయ్యిని ఇంకా బెల్లాన్ని సమపాళ్లల్లో కలిపి తీసుకోవడం వల్ల మైగ్రేన్ తలనొప్పి ఈజీగా తగ్గుతుంది. బెల్లాన్ని ఆహారంగా తీసుకోవడం వల్ల రక్తం ఈజీగా శుద్ది అవుతుంది. నాడీ మండల వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. శరీరంలో మెటబాలిజం రేటు కూడా పెరుగుతుంది. చర్మ ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. అలాగే శరీరంలో ఐరన్ లోపం తలెత్తకుండా ఉంటుంది. ఈ విధంగా బెల్లం మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని దీనిని తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: