చంద్రగ్రహణం రోజున ఇలాంటివి చేయకూడదా..!!

Divya
ఏడాది మొదటిసారి చంద్రగ్రహణం ఈ రోజున కనిపించనుంది. ఈ ఏడాది ఏప్రిల్ 20వ తేదీన అరుదైన హైబ్రిడ్ సూర్యగ్రహణం పలుదేశాలలో కనిపించింది. సంవత్సరంలో ఇది మొదటి సూర్యగ్రహణం తర్వాత ఈ రోజున మళ్లీ తొలిసారి చంద్రగ్రహణం రాబోతోంది. అయితే ఈ గ్రహణ సమయంలో చేయకూడని పనులు వాటి గురించి కొంతమంది శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు వాటి గురించి తెలుసుకుందాం.

భూమి చంద్రుడు కంటే చాలా పెద్దది అందుకే దీని నీడ కూడా చాలా పెద్దదిగా వస్తుంది. ఈ కారణంగా సూర్యగ్రహణాల కంటే చంద్రగ్రహణాలు ప్రపంచంలోని పలు ప్రాంతాలలో ఎక్కువగా కనిపించడం జరుగుతూ ఉంటుంది. ఆసియా, రష్యా, ఆఫ్రికా ,అంటార్కిక వంటి ప్రాంతాలలో ఈ చంద్రగ్రహణం కనిపిస్తూ ఉంటుంది. ఈ ఏడాది మొదటిసారి చంద్రగ్రహణం ఇండియాలో పలు ప్రాంతాలలో ఈరోజు రాత్రి 8:44 గంటలకు ప్రారంభమై 10:52 ముగియనుంది. మే 6వ తేదీన మధ్యాహ్నం 1:01 గంటలకు పూర్తిగా ముగియనుంది. ఈ చంద్రగ్రహణం రోజున గర్భంతో ఉన్నవారు బయటికి రాకూడదు ఒకవేళ వస్తే శిశువు ఆరోగ్యం పైన చెడు ప్రభావాన్ని చూపుతోందని చాలామంది నమ్ముతూ ఉంటారు. అయితే ఇవన్నీ కేవలం ఊహాగానాలు మాత్రమే అన్నట్లుగా పరిశోధనలు ఏమాత్రం రుజువు కాలేదని తెలియజేస్తున్నారు.

గ్రహణం సమయం లో వెలుపడే రేడియేషన్ కంటి చూపును కూడా దూరం చేస్తుందని చంద్రుడిని నేరుగా కళ్ళతో చూడడం చాలా ప్రమాదమని.. కొంతమంది తెలియజేస్తూ ఉంటారు.. చంద్రుని కిరణాలు మన కళ్ళకు ఎలాంటి హాని చేయవు. ఇక చంద్రగ్రహణం సమయంలో నిద్ర పోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవట. చంద్రగ్రహణం సమయంలో ఆహారం తినకూడదని తెలియజేస్తూ ఉంటారు. అయితే ఇది కూడా కేవలం అపోహ అన్నట్లుగా తెలియజేస్తున్నారు. గ్రహణం సమయంలో శృంగారంలో పాల్గొంటే చెడు జరుగుతుందని చాలామంది ఈ విషయాన్ని నమ్ముతూ ఉంటారు. అయితే కొంతమంది పరిశోధకులు తెలిపిన ప్రకారం భార్యతో ప్రేమగా మెలగడం వల్ల ఎలాంటి సమస్యలు రావని గ్రహణానికి శృంగారానికి సంబంధం లేదని తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: