షుగర్ పెషేంట్స్ ధైర్యంగా తినకలిగే పండ్లు ఇవే..!

Divya
ఈ మధ్యకాలంలో షుగర్ పేషెంట్స్ ఎలాంటి పండ్లను తీసుకోవాలన్నా షుగర్ లెవెల్స్ పెరుగుతాయని భయపడుతూ ఉంటారు.కానీ కొన్ని పండ్లలో గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది.ఇలాంటి పండ్లను తీసుకోవడం వారి రక్తంలో షుగర్ లెవల్స్ హెచ్చు తగ్గులుకు గురి కాకుండా ఉంటాయి.కావున అలాంటి పండ్లు ఏంటో ఇప్పుడు చూద్దాం..
ఆపిల్..
రోజుకు ఒక ఆపిల్ తినడం వల్ల డాక్టర్ దూరం పెట్టవచ్చు అని పెద్దలు ఊరికే చెప్పలేదు.ఇందులో ఆంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి.కావున షుగర్ పేషెంట్ సైతం ధైర్యంగా ఈ పండ్లను తీసుకోవచ్చు.
ఆరెంజ్..
ఆరెంజ్ ఆరెంజ్ లో తక్కువ చెక్కరలు, తక్కువ క్యాలరీలు మరియు ఎక్కువ విటమిన్ సి ఉండడం వల్ల మధుమేహంతో ఉన్నవారు ఆరంజ్ ఫ్రూట్ ని తీసుకోవడం కూడా ఉత్తమమే అని చెప్పవచ్చు. మరియు ఇందులో గ్లైసమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది.
కివి..
ఈ పండు తినడానికి పుల్లగా తియ్య గా చాలా రుచిగా ఉంటుంది.ఇందులో విటమిన్ సి మరియు యాంటీ డయాబెటిక్ గుణాలు అధికంగా ఉండడం వల్ల షుగర్ పేషెంట్స్ తప్పకుండా తింటే మధుమేహం కంట్రోల్ లోకి వస్తుంది.
జామ పండు..
మధు మేహులు వారి,రోజువారి ఆహారంలో జామ పండు తప్పనిసరిగా తీసుకోవడం చాలా ఉత్తమం.వారికి ఇది ఉత్తమమైన ఆహారం అని చెప్పవచ్చు.జామ పండులో విటమిన్ సి,డైయేటరీ పైబర్స్ అధికంగా ఉండడం వల్ల మధుమేహం కంట్రోల్లో ఉంటుంది.
పుచ్చకాయ..
వేసవిలో అధికంగా లభించే పుచ్చకాయలో 90% నీరు ఉండటమే కాక,100grms పుచ్చకాయలో కేవలం 10 గ్రాముల షుగర్ మాత్రమే ఉంటుంది. కావున షుగర్ పేషెంట్  ధైర్యంగా తీసుకోవచ్చు.అంతేకాక ఇందులో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది కావున రక్తహీనత కూడా దరి చేరలేదు.
అవకాడో..
ఒక అవకాడోలో 1 గ్రాము చక్కెర మాత్రమే ఉంటుంది. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు నిర్భయంగా రోజూ తీసుకోవచ్చు.అలాగే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగించి,గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: