మొహం పై మచ్చలు తగ్గించడానికి కర్పూరాన్ని వాడండి ఇలా..!

Divya
చిన్న వయసులో మొహం ఎటువంటి మచ్చలు,టాన్, మొటిమలు వంటివి లేకుండా కాంతివంతంగా,నిర్మలంగా మెరుస్తువుంటుంది.కానీ ఇప్పుడున్న ఆహార అలవాట్లు, జీవన విధానం, హార్మోనల్ సమస్యలు వల్ల చాలా మందికి మొటిమలు, మచ్చలు, జిడ్డు కారడం, మృతకణాల వంటి ఎన్నో సమస్యలు తలెత్తి, ముఖం నిర్జీవంగా, కాంతి విహీనంగా తయారవుతుంది.అలాంటి వారు వారి ముఖాన్ని కాంతివంతంగా ఉంచుకోవడానికి,రకరకాల ప్రోడక్ట్ లు వాడుతుంటారు.మరియు బ్యూటీ పార్లర్ చుట్టూ తిరిగి చాలా డబ్బును ఖర్చు చేస్తూ ఉంటారు.కానీ ఎలాంటి ప్రయోజనం ఉండదు.వాటికీ బదులుగా ఇంటిలో సహజంగా దొరికే వస్తువులతో చేసే చిట్కాలు చాలా బాగా పనిచేస్తాయి.
మరియు  ఖర్చు కూడా చాలా తక్కువ. ముఖం మీద నల్లని మచ్చలు వచ్చాయంటే ఒక పట్టాన వదలవు. అలాంటప్పుడు కర్పూరంతో చేసే చిట్కాను ఫాలో అయితే చర్మ సమస్యలు అన్నింటికీ ఉపశమనం కలుగుతుంది.
దీని కోసం గుప్పెడు తులసి ఆకులను తీసుకొని, శుభ్రం చేసి,మెత్తని పేస్ట్ చేసుకోవాలి.అందులో అరస్పూన్ పసుపు, రెండు చిటికెలంత కర్పూరం బిళ్ళ పొడి వేయాలి.ఆ తర్వాత ఆ మిశ్రమంలో ఒక స్పూన్ రోజ్ వాటర్ వేసి బాగా మిక్స్ చేయాలి.ఇప్పుడు మొహం బాగా శుభ్రం చేసుకొని,ముందు తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి రాసి, అది బాగా ఆరిన తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో మర్దన చేస్తూ శుభ్రం చేసుకోవాలి.ఇదే విధంగా వారానికి రెండు సార్లు చేస్తే ముఖం కాంతివంతంగా తయారవుతుంది..
తులసిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కళంగా లభించడం వలన చర్మంలో మృత కణాలను తొలగిపోయి,కొత్త కణాల ఉత్పత్తికి ఉపయోగపడుతుంది.అంతే కాక ముఖం మీద నల్లని మచ్చలను తొలగించటానికి చాలా బాగా సహాయపడుతుంది.పసుపులో అధికంగా ఉన్న యాంటీ ఏజింగ్ గుణాలు చర్మం మీద ముడతలు లేకుండా తగ్గిస్తుంది. కర్పూరంలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మొటిమలు రాకుండా సెభంను కంట్రోల్ చేస్తుంది.వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కావున ముఖం అందంగా తయారవడానికి ఇంటి చిట్కాలు వాడటం ఉత్తమం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: