ఈ చెట్టుతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి?

Purushottham Vinay
మన చుట్టూ ఉండే ఆరోగ్యకరమైన ఔషధ చెట్లల్లో మోదుగ చెట్టు కూడా ఒకటి. ఈ చెట్టు గురించి మనలో చాలా మందికి కూడా తెలిసే ఉంటుంది. మోదుగ చెట్టు ఎక్కువగా రోడ్ల పక్కన, చేల దగ్గర ఇంకా అడువులల్లో పెరుగుతుంది.ఈ చెట్టులో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి.దీనిని వాడడం వల్ల మనం చాలా రకాల ఆరోగ్య ప్రయోనాలను పొందవచ్చు. దీనిని సరైన పద్దతిలో వాడటం వల్ల ఎన్నో రకాలు అనారోగ్య సమస్యలను శాశ్వతంగా దూరం చేసుకోవచ్చు. దీన్ని ఔషధంగానే కాదు హోమ ద్రవ్యంగా కూడా  ఉపయోగిస్తారు. మోదుగ చెట్టును నెయ్యిలో మండించినప్పుడు వచ్చే పొగను పీల్చడం వల్ల మనం చాలా రకాల అనారోగ్య సమస్యలని దూరం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మోదుగ చెట్టును ఉపయోగించడం వల్ల ముఖ్యంగా ప్లీహ రోగాలు, మూల వ్యాధులు ఇంకా అలాగే శ్లేష్మ రోగాలు నయం అవుతాయి.ఈ చెట్టు బెరడు కారం, చేదు ఇంకా వగరు రుచులను కలిగి ఉంటుంది. ఇక నీళ్ల విరోచనాలను తగ్గించడంలో మోదుగ చెట్టు జిగురు మనకు చాలా బాగా సహాయపడుతుంది. మోదుగ చెట్టు జిగురును ఎండబెట్టి దానిని దంచి పొడిగా చేసుకోవాలి.ఇక ఈ పొడిని 10 గ్రాముల మోతాదులో తీసుకుని దానికి 10 గ్రాముల దాల్చిన చెక్క పొడిని కలపాలి.


ఈ మిశ్రమాన్ని మూడ పూటలా అర టీ స్పూన్ మోతాదులో తీసుకోవడం వల్ల నీళ్ల విరోచనాలు ఈజీగా తగ్గు ముఖం పడతాయి. మోదుగ చెట్టు కాడను దంచి దానిని పేస్ట్ లాగా చేయాలి. ఈ పేస్ట్ ను మొలలపై రాసి కట్టు కట్టాలి. ఇలా చేయడం వల్ల క్రమంగా మొలల ఈజీగా హరించుకుపోతాయి. తేలు కాటుకు విరుగుడుగా కూడా దీనిని వాడతారు.మోదుగ చెట్టు గింజలను జిల్లేడు పాలతో కలిపి మెత్తగా నూరి ఈ మిశ్రమాన్ని తేలు కాటుకు గురి అయిన చోట రాయాలి. ఇలా చేయడం వల్ల తేలు కాటు వల్ల కలిగే బాధ చాలా త్వరగా తగ్గుతుంది. మౌత్ వాష్ గా కూడా ఈ చెట్టు మనకు చాలా బాగా సహాయపడుతుంది. మోదుగ చెట్టు ఆకులను నీటిలో వేసి కషాయంలా చేసుకోని ఈ కషాయాన్ని నోట్లో పోసుకుని పుక్కిలించడం వల్ల నోరు బాగా శుభ్రపడుతుంది. ఇంకా నోటి సమస్యలు రాకుండా ఉంటాయి. పిల్లల్లో వచ్చే నులిపురుగుల సమస్యను తగ్గించడంలో కూడా ఈ మోదుగ చెట్టు  సహాయపడుతుంది. మోదుగ చెట్టు విత్తనాలను పొడిగా చేసి ఈ పొడిని తేనెతో కలిపి తీసుకోవడం వల్ల నులి పురుగుల సమస్య ఈజీగా తగ్గుతుంది.అలాగే ఈ మోదుగ చెట్టు ఆకులకు షుగర్ ను నియంత్రించే శక్తి కూడా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: