ఇలా చేస్తే కీళ్ళ నొప్పులు మటుమాయం?

Purushottham Vinay
ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా అందరూ కీళ్ళ నొప్పుల సమస్యలతో బాధపడుతున్నారు. చాలా మంది ఈ నొప్పులతో చాలా రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. కనీసం వారి పని కూడా వారు చేసుకోలేక చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా నొప్పులతో బాధపడే వారు ఇప్పుడు చెప్పే ఈ టిప్స్ ని వాడడం వల్ల చాలా సులభంగా నొప్పులను తగ్గించుకోవచ్చు. ఈ టిప్స్ వాడడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు.కీళ్ళ నొప్పులతో బాగా బాధపడే వారు ముందుగా ఒక గిన్నెలో 5 ఎండిన ఆల్ బుకరా పండ్లను, నానబెట్టిన ఒక డ్రై ఆఫ్రికాట్ ను ఇంకా అలాగే నానబెట్టిన ఒక అంజీర్ ను  రోజూ రాత్రి నిద్రపోవడానికి అరగంట ముందు తీసుకోవాలి. ఎందుకంటే ఈ డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలన్నీ అందుతాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పుల నుండి చాలా సులభంగా ఉపశమనం కలుగుతుంది. ఈ టిప్ తో పాటు బాహ్య ప్రయోగించే మరో టిప్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


ఈ టిప్ ని తయారు చేసుకోవడానికి గానూ ఆవాల పిప్పి చెక్కను, పచ్చి పసుపును ఇంకా అలాగే ఆవ నూనెను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా నీటిలో 100 గ్రాముల ఆవ చెక్కను వేసి దాన్ని నానబెట్టాలి. ఈ చెక్క నానిన తరువాత నీటిని వంపేసి ఆ నానిన చెక్కను పక్కకు ఉంచాలి.ఇక ఆ తరువాత కళాయిలో 20 గ్రాముల ఆవ నూనెను వేసి వేడి చేయాలి.తరువాత ఆ నూనె వేడయ్యాక పసుపును వేసి కలపాలి. తరువాత ఆవ చెక్కను వేసి బాగా కలపాలి. దీనిని దగ్గర పడే దాకా ఉడికించి స్టవ్ ని ఆఫ్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని వస్త్రంలో వేసి మూట కట్టి దానితో నొప్పులపై మీరు కాపడం పెట్టుకోవచ్చు లేదా ఈ మిశ్రమాన్ని నొప్పులపై రాసి సాఫ్ట్ గా మసాజ్ చేసి కట్టు కట్టుకోవాలి. దీనిని రాత్రంతా అలాగే ఉంచి పొద్దున్నే బాగా శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల నొప్పులు చాలా ఈజీగా తగ్గుతాయి. ఈ టిప్స్ పాటించడం వల్ల చాలా సులభంగా మనం నొప్పులను ఈజీగా తగ్గించుకోవచ్చు. కీళ్ల నొప్పులు ఇంకా అలాగే మోకాళ్ల నొప్పులతో బాధపడే వారు ఈ చిట్కాను ఖచ్చితంగా పాటించడం వల్ల చాలా మంచి ఫలితం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: