కొండంత బలం కోసం ఈ లడ్డూలు తినండి?

Purushottham Vinay
మనం గోధుమ పిండితో చపాతీ, రొట్టెలు, పుల్కాలు ఇలా రకరకాల రుచికరమైన ఆహార పదార్థాలను తయారు చేస్తూ ఉంటాం. ఇవి ఎంతో రుచికరంగా ఇంకా చాలా బలంగా కూడా ఉంటాయి.వీటిని తీసుకోవడం వల్ల ఖచ్చితంగా మన ఆరోగ్యానికి కూడా చాలా రకాలుగా మేలు కలుగుతుంది. అలాగే గోధుమపిండితో ఇవే కాకుండా మనం చాలా రుచిగా ఉండే లడ్డూలను కూడా తయారు చేసుకోని తినవచ్చు. ఈ లడ్డూలను తయారు చేయడం కూడా చాలా ఈజీ. అలాగే ఇవి తినడానికి చాలా రుచిగా కూడా ఉంటాయి.అయితే ఈ గోధుమపిండితో లడ్డూలను సులభంగా, రుచిగా ఎలా తయారు చేసుకోవాలి? ఇంకా వాటి తయారీకి కావల్సిన పదార్థాల గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.గోధుమపిండి లడ్డూ తయారీకి కావల్సిన పదార్థాల విషయానికి వస్తే..నెయ్యి – అర కప్పు, బొంబాయి రవ్వ – 2 టేబుల్ స్పూన్స్, గోధుమపిండి – ఒక కప్పు, కాచి చల్లార్చిన పాలు – పావు కప్పు ఇంకా అలాగే వేయించిన డ్రై ఫ్రూట్స్ – కొద్దిగా, బెల్లం తరుగు – అర కప్పు లేదా తగినంత, బాదం పప్పు -య10, యాలకులు – 4 తీసుకోవాలి.


ఈ గోధుమ లడ్డూ తయారీ విధానం విషయానికి వస్తే..మీరు ముందుగా ఒక కళాయిలో రెండు టీ స్పూన్ల నెయ్యి వేసి దానిని వేడి చేయాలి. ఆ నెయ్యి వేడయ్యాక రవ్వ వేసి వేయించాలి. ఆ తరువాత గోధుమపిండిని కూడా వేసి వేయించాలి. దీనిని కలుపుతూ కొద్ది కొద్దిగా నెయ్యి వేస్తూ పది నిమిషాల పాటు అలాగే వేయించాలి. ఇలా వేయించిన తరువాత పాలు పోసి బాగా కలపాలి. దీనిని మరలా పొడి పొడిగా అయ్యే దాకా వేయించి ప్లేట్ లోకి తీసుకోని ఆ తరువాత జార్ లో బెల్లం, ఒక టేబుల్ స్పూన్ వేయించిన గోధుమపిండి, బాదం పప్పు ఇంకా యాలకులు వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.


ఇప్పుడు బెల్లం మిశ్రమాన్ని అలాగే డై ఫ్రూట్స్ ను కూడా వేయించిన గోధుమపిండిలో వేసి బాగా కలపాలి.ఇప్పుడు అంతా కలిసేలా కలుపుకుని కావల్సిన పరిమాణంలో లడ్డూలుగా వాటిని చట్టుకోవాలి. ఇవి లడ్డూలుగా చుట్టడానికి రాకపోతే అందులో కొద్దిగా నెయ్యి వేసుకుని కలపాలి. ఇలా చేయడం వల్ల చాలా రుచిగా ఉండే గోధుమపిండి లడ్డూలు ఈజీగా తయారవుతాయి. వీటిని తినడం వల్ల రుచితో పాటు సంపూర్ణ ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. వీటిని చక్కగా స్టోర్ చేసుకోవడం వల్ల నెల రోజుల పాటు అవి తాజాగా ఉంటాయి. ఈ విధంగా గోధుమపిండితో చేసిన లడ్డూలను అందరూ చాలా ఇష్టంగా తినొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: