తొందరగా సన్నబడాలంటే ఈ ఫైబర్స్ తినాల్సిందే..!

Divya
ఈ మధ్య జంక్ ఫుడ్ తినడం,అధికశ్రమ లేకపోవడం, ఆహార నియమాలు పాటించకపోవడం వంటి వాటి వల్ల అధిక బరువు పెరుగుతున్నారు.ఈ అధిక బరువు అనేది చాలా అనారోగ్యాలను తెచ్చిపెడుతుంది కూడా. అలాంటివారు బరువు తగ్గాలని రకరకాల ప్రయత్నిస్తూ ఉన్నా కూడా ఎటువంటి ప్రయోజనం కలగక విసిగిపోతుంటారు.అధిక బరువును తొందరగా తగ్గించుకోవడానికి,కొన్నిరకాల ఫైబర్లు తినడం,చాలా బాగా ఉపయోగపడుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఈ ఫైబర్లను అధికంగా ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల,జీర్ణవ్యవస్థలో మంచి బ్యాక్టీరియాను పెంచి,జీర్ణశక్తి మెరుగుపడేందుకు దోహదపడతాయి.దీనివల్ల తిన్న ఆహారం తొందరగా జీర్ణం అయి,ఎక్కువ శక్తిని ఇస్తుంది. దీనితో తినాలానే భావన తగ్గుతుంది.మరియు అధిక పైబర్ తినడంతో పొట్ట నిండినట్టు అనిపిస్తుంది.ఇలా తొందరగా సన్నబడొచ్చు.అలాంటి ఫైబర్ అధికంగా ఉన్న ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..
 అవకాడో..
అవకాడోన్ని అధికంగా తీసుకోవడం వల్ల ఇందులోని మోనోసాచ్యురేటెడ్ ఫ్యాట్స్ పుష్కలంగా లభించడం వల్ల,అధిక బరువును తొందరగా తగ్గిస్తాయి.ముఖ్యంగా నడుము చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో ఇది బాగా ఉపయోగపడుతుంది. మరియు ఇందులో విటమిన్ సి,మెగ్నీషియం,కాల్షియం అధికంగా లభిస్తాయి కూడా.
జామకాయ..
జామకాయను తరచూ తీసుకోవడం వల్ల,ఇందులోని విటమిన్ ఏ మరియు విటమిన్ సి తొందరగా బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి.మరియు ఇందులో పొటాషియం,మెగ్నీషియం,ఫైటో న్యూట్రియన్స్ బెల్లీ ఫ్యాట్ ని కరిగించెందుకు దోహదపడతాయి.
స్వీట్ పొటాటో..
స్వీట్ పొటాటోను భోజనానికి అరగంట ముందు తీసు  కోవడం వల్ల,పొట్ట నిండిన భావన కలిగి, భోజనం తక్కువ తినాలనిపిస్తుంది.మరియు ఇందులో తక్కువ క్యాలరీలు,అధిక డైయేటరీ ఫైబర్ లు ఉండడం వల్ల ఇది వెయిట్ లాస్ కావాలి అనుకునే వారికి మంచి డైట్ అని చెప్పవచ్చు.
బ్రకోలి..
దీనిని డైట్ లో చేర్చుకోవడంతో,ఇందులోని విటమిన్ కె,అధిక ఫైబర్లు,పొటాషియం,మాంగనీస్,విటమిన్ బి12, తొందరగా బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి.
ఓట్స్..

ఓట్స్ని రోజు అల్పాహారంగా తీసుకోవడంతో,ఇందులో ఉన్న అధిక ఫైబర్ కంటెంట్ తొందరగా పొట్ట నిండిన భావన కలిగిస్తుంది.మరియు ఇందులో విటమిన్స్,మినరల్స్ ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: