ఈ లడ్డు రోజు తింటే ఏ జబ్బు రాదు?

Purushottham Vinay
మన శరీరం ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలన్నా, ఎముకలు ధృడంగా ఉండాలన్నా అలాగే మన కండరాలు సక్రమంగా పని చేయాలన్నా మన శరీరానికి ఖచ్చితంగా తగినంత ఐరన్ అందించడం చాలా అవసరం. మన ఇంట్లోనే మనకు సులభంగా లభించే పదార్థాలతో సులభంగా లడ్డూను తయారు చేసుకుని తినడం వల్ల చాలా ఈజీగా మనం రక్తహీనతను తగ్గించుకోవచ్చు.అలాగే ఈ లడ్డూలను తయారు చేయడం కూడా చాలా సులభం.రక్తహీనతను తగ్గించే లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ లడ్డూలను తయారు చేసుకోవడానికి  మనం వాల్ నట్స్ ను, నువ్వులను ఇంకా తాటి లేదా నల్ల బెల్లాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా మీరు ఒక జార్ లో 50 గ్రాముల వాల్ నట్స్ ను, 50 గ్రాముల నువ్వులను ఇంకా 50 గ్రాముల తాటి బెల్లాన్ని తీసుకోవాలి. ఆ తరువాత వీటిని మెత్తగా మిక్సీ పట్టుకుని మీరు ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఆ తరువాత ఇందులో ఒక టీ స్పూన్ నెయ్యిని వేసి కలపాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని తీసుకుని వాటిని లడ్డూలుగా చుట్టుకోవాలి.


ఇలా చేయడం వల్ల రక్తహీనతను తగ్గించే లడ్డూలు చాలా ఈజీగా తయారవుతాయి. వీటిని మీరు రోజుకు ఒకటి లేదా రెండు చొప్పున తినవచ్చు.మీరు ఈ లడ్డూలను నేరుగా తినవచ్చు లేదా పాలల్లో కలిపి కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా ఈ లడ్డూలను తీసుకోవడం వల్ల ఐరన్ తో పాటు మన శరీరానికి కావల్సిన ఇతర పోషకాలు కూడా చాలా ఈజీగా లభిస్తాయి. ఈ లడ్డూలను తినడం వల్ల రక్తహీనత సమస్య కూడా ఈజీగా తగ్గుతుంది. అలాగే ఎముకలు చాలా ధృడంగా తయారవుతాయి. రోజంతా మీరు చాలా ఉత్సాహంగా ఉండవచ్చు. అలాగే నీరసం, బలహీనత వంటి సమస్యలు ఈజీగా దూరమవుతాయి. ఈ విధంగా లడ్డూలను తయారు చేసుకుని తినడం వల్ల మనం చాలా సులభంగా రక్తహీనత సమస్యను శాశ్వతంగా దూరం చేసుకోవచ్చు.ఎల్లప్పుడూ కూడా చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: