పండ్ల తొక్కలతో కోమలమైన ముఖం పొందండి.

Divya
చాలా మందికి ఆహారపు అలవాట్లు,జీవన శైలి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల,మొఖంపై మొటిమలు, మచ్చలు,కళ్ల కింద నలుపు,జిడ్డు కారడం,వృద్యాప్య ఛాయలు అధికంగా వస్తుంటాయి.ఈ చర్మ సమస్యలు వల్ల,వారు కాంఫిడెన్స్ కోల్పోయి,నలుగురిలో కలవాలన్నా మొహ మాటానిక.గురవుతుంటారు.అందువల్ల వాటిని పోగొట్టు కోవడానికి రకరకాల రసాయనిక సౌందర్య ఉత్పత్తులు వాడినా తగ్గకపోగా,సైడ్ ఎఫెక్ట్స్ కలిగి,ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారికి పండ్ల తొక్కలతో తయారు చేసుకునే చిట్కాలు చాలా బాగా ఉపయోగపడతాయి.
సాధారణంగా పండ్లను తిని తొక్కలను పడేస్తుంటాము. కానీ అందులోని పోషక విలువలు తెలిస్తే అస్సలు అలా చేయరు.అటు వంటి పండ్ల తొక్కలను ఎలా వాడాలో, వాటి ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
దోసకాయ తొక్క..
దోసకాయ తొక్కలను పేస్ట్ చేసి,ముఖానికి రాసుకోవడం వల్ల చర్మం మాశ్చరైజంగా మారి మృదువు గా తయారవుతుంది.మరియు జిడ్డు కారడం కూడా తగ్గిపోతుంది.ఈ మాస్క్ తరుచూ వేసుకోవడం వల్ల చర్మ వాపు సమస్యను రాకుండా నివారిస్తుంది.
అరటిపండు తొక్క..
అరటిపండుతొక్కలో మెగ్నీషియం,పొటాషియం,విటమిన్లు,ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.ఈ ప్యాక్ కోసం అరటిపండు తొక్కలను
పేస్ట్ లా తయారు చేసుకుని ముఖానికి రాయడంవల్ల,మొటిమలు,మచ్చలు,చర్మం మంట,దురద,తామర,సోరియాసిస్ వంటి సమస్యలు తగ్గుతాయి.మరియు చర్మాన్ని మాయిశ్చరైజింగ్ గా ఉంచుతుంది.
మామిడి పండు తొక్క..
మామిడి తొక్కలో విటమిన్ ఎ,సి,ఐరన్, యాంటీఆక్సిడెంట్లుఫైటోన్యూట్రియెంట్లు పుష్కళంగా లభిస్తాయి.ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.ఈ ప్యాక్ కోసం మామిడి తొక్కను ఎండలో ఆరబెట్టి పొడి చేసుకోవాలి.దీన్ని పెరుగుతో కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి.ఇది బాగా అరిన తర్వాత గోరువెచ్చని నీటితో మర్దన చేస్తూ శుభ్రం చేసుకోవాలి.ఇలా తరచూ చేయడం వల్ల, మొటిమలు,మచ్చలు,తగ్గి చర్మం కాంతివంతంగా తయారవుతుంది.
దానిమ్మ తొక్కలు..
దీనికోసం దానిమ్మ తొక్కలను ఎండబెట్టి పొడిలా చేసుకుని,అందులో తేనె కలుపుకొని ప్యాక్ లా వేసుకోవాలి.ఇలా చేయడం వల్ల ఇది నాచురల్ మాశ్చరైజింగ్ గా పనిచేస్తుంది.ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ మరియు ఇన్ఫ్లమేటరీ గుణాలు వృద్ధాప్య ఛాయాలను దూరం చేయడమే కాక మొటిమలు మచ్చలను తగ్గిస్తాయి.దీనితో చర్మం కోమలంగా తయారవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: