బార్లీ గింజలు ఆరోగ్యానికి ఎంత మంచివంటే?

Purushottham Vinay
బార్లీ మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దీనిలో మన శరీరానికి అవసరమయ్యే చాలా పోషకాలు ఉంటాయి. 100 గ్రాముల బార్లీలో 354 క్యాలరీల శక్తి, 452 మైక్రో గ్రాముల పొటాషియం, 17 గ్రాముల ఫైబర్, 19 శాతం ఐరన్, 15 శాతం విటమిన్ బి6, 33 శాతం మెగ్నీషియం ఇంకా అలాగే 3 శాతం క్యాల్షియం వంటి పోషకాలు ఉంటాయి. బార్లీని ఉడికించి ఆహారంగా తీసుకున్నా లేదా నీటిలో మరిగించి ఈ నీటిని తాగినా ఇలా ఎలా తీసుకున్నా కూడా మన ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు కలుగుతుంది. షుగర్ వ్యాధితో బాధపడే వారికి బార్లీ చాలా చక్కటి ఆహారం. దీనిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఈజీగా అదుపులో ఉంటాయి.శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుంగె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, శరీర బరువును తగ్గించడంలో బార్లీ మనకు చాలా సహాయపడుతుంది. బార్లీని ఉడికించిన నీటిని తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ల సమస్య ఈజీగా తగ్గుతుంది. అలాగే మూత్రాశయ ఇన్ఫెక్షన్ లు మన దరి చేరకుండా ఉంటాయి.ఇంకా శరీరంలో మలినాలు తొలగిపోతాయి. శరీరం బాగా శుభ్రపడుతుంది. బార్లీని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం చాలా రకాల క్యాన్సర్ ల బారిన పడకుండా ఉంటాము. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్ ను నశింపజేసి శరీర ఆరోగ్యాన్ని కాపాడడంలో చాలా బాగా సహాయపడతాయి.


వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి ఈజీగా పెరుగుతుంది. పొట్ట ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ప్రేగుల్లో కదలికలు పెరిగి మలబద్దకం సమస్య ఈజీగా నివారించబడుతుంది. మలబద్దకం సమస్యతో బాధపడే వారు వీటిని తీసుకోవడం వల్ల ఖచ్చితంగా చాలా మంచి ఫలితం ఉంటుంది.ఇంకా ఈ బార్లీ గింజల్లో ఉండే పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మన ఎముకలను ధృడంగా ఇంకా ఆరోగ్యంగా ఉంచడంలో ఆస్ట్రోపోరోసిస్ వంటి ఎముకలకు సంబంధించిన సమస్యలను తగ్గించడంలో కూడా బార్లీ గింజలను మనకు సహాయపడతాయి. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, వృద్దాప్య ఛాయలను మన దరి చేరకుండా చేయడంలో ఇంకా అలాగే గాయాలను త్వరగా మానేలా చేయడంలో, శరీరంలో ఇన్ ప్లామేషన్ ను తగ్గించడంలో ఇలా చాలా రకాలుగా బార్లీ గింజలు మనకు ఉపయోగపడతాయి. వీటిని తీసుకోవడం వల్ల మనం చాలా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. కాబట్టి వీటిని తప్పకుండా ఆహారంలో భాగంగా చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: