ఇలా చేస్తే గుండె జబ్బులు అస్సలు రావు?

Purushottham Vinay
మన గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో ఎండు ద్రాక్ష  మనకు చాలా బాగా సహాయపడుతుంది. అధిక రక్తపోటు, ఛాతిలో నొప్పి ఇంకా అధిక కొలెస్ట్రాల్ వంటి సమస్యలను తగ్గించడంలో ఇవి ఎంతో సహాయపడతాయి. ఎండు ద్రాక్ష తీసుకోవడం వల్ల మన శరీరంలో నైటిక్ర్ యాసిడ్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. దీంతో రక్తపోటు చాలా ఈజీగా అదుపులో ఉండడంతో పాటు రక్తనాళాలు కూడా ఎక్కువగా వ్యాకోచిస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు రక్తహీనతను, ఎసిడిటీని తగ్గించడంలో ఇంకా అలాగే రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా ఎండు ద్రాక్ష మనకు చాలా బాగా సహాయపడుతుంది.ఇక ప్రతి రోజూ 6 నుండి 8 ఎండు ద్రాక్షలను రాత్రిపడుకునే ముందు గోరు వెచ్చని నీటిలో వేసి నానబెట్టాలి. పొద్దున్నే ఈ నీటిని తాగి ఎండు ద్రాక్షను నమిలి తినాలి. ఈ విధంగా ఎండు ద్రాక్షను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం చాలా బాగా మెరుగుపడుతుంది.ఇంకా అలాగే రెండు లవంగాలను ఒక గ్లాస్ నీటిలో వేసి బాగా మరిగించాలి. ఆ తరువాత ఈ లవంగాలను తిని ఈ నీటిని టీ తాగినట్టు చప్పరిస్తూ తాగాలి. ఇలా తీసుకోవడం వల్ల కూడా గుండె ఆరోగ్యం చాలా బాగా మెరుగుపడుతుంది.


 గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో వెల్లుల్లి కూడా మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది.ఎందుకంటే ఈ వెల్లుల్లిలో ఎన్నో పోషకాలు ఇంకా ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో అలాగే రక్తాన్ని పలుచగా చేయడంలో ఇంకా షుగర్ ను అదుపులో ఉంచడంలో ఇలా చాలా రకాలుగా వెల్లుల్లి మనకు సహాయపడుతుంది.ఇంకా అలాగే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముల్లేటి, అల్లం, ఉసిరి, లవంగాలు, దాల్చిన చెక్క, తులసి ఆకులు కూడా చాలా సహాయపడతాయి. వీటితో కషాయం తయారు చేసుకుని తాగడం వల్ల ఖచ్చితంగా చాలా మంచి ఫలితాలను పొందవచ్చు. ఇంకా వీటితో పాటు ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. నూనె పదార్థాలను ఇంకా జంక్ ఫుడ్ ను తక్కువగా తీసుకోవాలి. ఖచ్చితంగా చక్కటి జీవన విధానాన్ని పాటించాలి. ముఖ్యంగా పండ్లను, కూరగాయలను ఎక్కువగా ఆహారంగా తీసుకోవాలి. ఈ విధంగా ఈ టిప్స్ పాటించడం వల్ల గుండె సమస్యలు రాకుండా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: