మైగ్రేన్ తలనొప్పిని క్షణాల్లో తగ్గించే టిప్?

Purushottham Vinay
చాలా మందిని ఎంతగానో వేధించే అనారోగ్య సమస్యల్లో ఖచ్చితంగా మైగ్రేన్ తలనొప్పి కూడా ఒకటి. ఒత్తిడి, ఆందోళన, ఎక్కువగా ఆలోచించడం ఇంకా డిఫ్రెషన్ వంటి కారణాల వలన ఈ తలనొప్పి చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.ఇంకా అలాగే స్త్రీలల్లో హార్మోన్ల అసమతుల్యత కారణంగా కూడా ఈ సమస్య ఎక్కువగా తలెత్తుతుంది. పురుషుల్లో కంటే స్త్రీలల్లోనే ఈ సమస్య చాలా ఎక్కువగా వస్తుంది. మైగ్రేన్ కారణంగా శబ్దాలను అస్సలు వినలేకపోవడం, వెలుతురును చూడలేకపోవడం ఇంకా అలాగే వాంతులు వంటి లక్షణాలు చాలా ఎక్కువగా కనిపిస్తాయి. అయితే మన ఇంట్లోనే ఒక డ్రింక్ ని తయారు చేసుకుని తాగడం వల్ల మనం చాలా సులభంగా ఈ సమస్యని తగ్గించుకోవచ్చు. మైగ్రేన్ ను తగ్గించే ఈ డ్రింక్ ని ఎలా తయారు చేసుకోవాలి.. ఇంకా దాని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. వంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఈ డ్రింక్ ని తయారు చేసుకోవడానికి  ముందుగా ఒక గిన్నెలో 200 ఎమ్ ఎల్ నీళ్లు పోసి వేడి చేయాలి. ఆ నీళ్లు కొద్దిగా వేడయ్యాక ఇందులో 2 టేబుల్ స్పూన్ల అల్లం రసం వేసి బాగా కలపాలి.తరువాత ఇందులో అర చెంచా దాల్చిన చెక్క పొడి ఇంకా ఒక టీ స్పూన్ పసుపు వేసి కలపాలి.


ఈ నీటిని 100 ఎమ్ ఎల్ అయ్యే దాకా బాగా మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తరువాత ఈ నీటిని గోరు వెచ్చగా అయ్యే దాకా చల్లార్చాలి. నీళ్లు గోరు వెచ్చగా అయిన తరువాత ఇందులో 5 నుండి 6 చుక్కల నిమ్మరసం వేసి బాగా కలిపి తాగాలి. మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతున్నప్పుడు ఈ డ్రింక్ ని తయారు చేసుకుని తాగడం వల్ల ఖచ్చితంగా చాలా మంచి ఫలితం ఉంటుంది.ఈ డ్రింక్ ని తాగడం వల్ల నరాల్లో ఉండే ఇన్ ప్లామేషన్ తగ్గి వెంటనే తలనొప్పి ఈజీగా తగ్గుతుంది.ఇంకా అలాగే ప్రతిరోజూ నీటిలో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్ అల్లం రసం కలిపి తాగాలి. ఇలా చేయడం వల్ల కూడా మైగ్రేన్ సమస్య చాలా ఈజీగా తగ్గుతుంది. అదే విధంగా ఒక ఆపిల్ ముక్క మీద ఉప్పును చల్లుకుని తినడం వల్ల కూడా మైగ్రేన్ సమస్య చాలా ఈజీగా తగ్గుతుంది. అలాగే ప్రతిరోజూ యోగా, ఆసనాలు వంటివి ఖచ్చితంగా చేస్తూ ఉండాలి.ఎందుకంటే వీటి వల్ల ఒత్తిడి, ఆందోళన మన దరి చేరకుండా ఉంటాయి. ఈ విధంగా ఈ టిప్స్ వాడడం వల్ల చాలా సులభంగా మనం మైగ్రేన్ సమస్య నుండి బయటపడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: