వీర్యకణ వృద్ధికి పనస తొనలు ఎలా ఉపయోగపడతాయో తెలుసా..?

Divya
పెళ్లయిన ప్రతి భార్యాభర్తలు ఏడాది కూడా తిరక్క ముందే సంతానం కలగాలని భావిస్తూ ఉంటారు.కానీ కొంతమందిలో కొన్ని రకాల సమస్యల వల్ల వారికి సంతానలేమి కలుగుతుంది.ఒక్కొక్కసారి భార్యలో అండం ఉత్పత్తి సరిగ్గా జరగక సంతానలేమి కలగవచ్చు లేదా భర్తలో వీర్యకణాలు సక్రమంగా ఉత్పత్తి కాక సంతానలేమి ఉండవచ్చు.అలాంటి మగవారికి పనస తొనలు చాలా బాగా ఉపయోగపడతాయి.వీటిని తరుచూ తీసుకోవడం వల్ల,ఇందులో దొరికే పోషకాలు వీర్య కణవృద్దికి దోహదపడి,సంతాన సమస్యలను నివారిస్తాయి.మగవారికి పనస తొనల వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందామా..
వీర్యకణ వృద్ధి సక్రమంగా జరగని మగవారు,తరచూ పనసపండు తీసుకోవడం వల్ల,అందులో ఉన్న ఫైటో న్యూట్రియెంట్లు,ఐసో ప్లేవిన్లు వీర్య కణాలు సక్రమంగా ఊత్పత్తి అవడానికి దోహదపడతాయి.అంతేకాక ఇందులో ఉన్న కాల్షియం ఎముకల మరియు దంతాలు దృఢంగా మారడానికి చాలా బాగా ఉపయోగపడతాయి.
 పనస పండు వల్ల ఇతర ప్రయోజనాలు..
వేసవికాలంలో దొరికే పనసపండ్లు తీసుకోవడం వల్ల, అందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలుక్యాన్సర్ని కలిగించే ప్రిరాడికల్స్ తో పోరాడి,క్యాన్సర్ దరిచేరకుండా కాపాడుతాయి.పనసలో ఉండే అధిక ఫైబర్ జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా చేసి గ్యాస్,ఆసిడిటి మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలను తొలగిస్తాయి.అంతేకాక ఇందులో ఉండే బీటా కేరోటీన్ జుట్టు పెరుగుదలకు చాలా బాగా సహాయపడుతుంది.చాలామంది గర్భిణీ స్త్రీలు ఎక్కువగా రక్తహీనతతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారికి వీటిని తగిన మోతాదులో ఇవ్వడం వల్లఇందులోని ఐరన్ కంటెంట్ రక్తహీనత సమస్యలు తొలగిస్తుంది.
పనస తొనలు తరచూ తీసుకోవడం వల్ల,ఇందులో విటమిన్ ఏ పుష్కలంగా లభిస్తుంది.దీని వలన వయసు వల్ల కలిగే,అంధత్వాన్ని పోగొడుతుంది.అంతేకాక రే చీకటితో బాధపడే వారికి కూడా ఉపశమనం కలుగుతుంది.మధుమేహం కలవారు ఇవి తియ్యగా ఉండడం వల్ల వీటిని తీసుకోకూడదని అపోహ పడుతూ ఉంటారు. కానీ వీటిని తగిన మోతాదులో తీసుకోవడం వల్ల,రక్తంలోని గ్లూకోజ్ లెవెల్స్ సక్రమంగా ఉంటాయి. కావున వేసవికాలంలో దొరికే పనస తొనలను ప్రతి ఒక్కరూ తీసుకోవడం చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: