పుచ్చకాయ తినేటప్పుడు ఈ రెండు తప్పులు చేస్తున్నారా..?

Divya
వేసవి మొదలవగానే సూర్యుడు నడి నెత్తిమీద తాండవం ఆడుతుంటాడు.ఈ వేడిని తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది.అధిక చమటలు పట్టి,వేస్ట్ వాటర్ అంతా బయటకు వెళ్తువుంటుంది.
అలాంటప్పుడు పుచ్చకాయ వంటి వాటర్ కంటెంట్ వున్న ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటాము.100 grms పుచ్చకాయ ముక్కల్లో 95 grms నీరే ఉంటుంది.దీనిని అధికంగా తీసుకోవడం వల్ల వేసవి తాపాన్ని తీరడమే కాక,ఐరన్ వల్ల రక్తం వృద్ధి చెందుతుంది.అన్ని రకాల పండ్లలో కన్నా,ఇందులో ఐరన్ అత్యధికంగా ఉంటుంది.అలాంటి పుచ్చకాయను వేసవిలో తీసుకునేటప్పుడు కొన్ని తప్పులు చేయడం వల్ల,దాని వల్ల కలిగే లాభాలు కూడా అందకుండా పోతాయి.పుచ్చకాయ తినేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
 ఉప్పు వేసుకోవడం..
కొంతమందికి పుచ్చకాయ తినేటప్పుడు ఉప్పు వేసుకోనే అలవాటు ఉంటుంది.మరియు వారు వేసవికాలంలో చెమట రూపంలో మన శరీరంలోని లవణాలు బయటికి వెళ్లిపోతాయని భావిస్తూ,ఎక్కువగా ఉప్పు తీసుకోవడం వల్ల,వెళ్ళిపోయిన లవణాలు రీప్లేస్ అవుతాయని భావిస్తుంటారు.కానీ చెమట రూపంలో మన శరీరంలో అధికంగా వున్న లవణాలు మాత్రమే బయటకు వెళ్తాయి.కావున మనం అధికంగా ఉప్పు తీసుకోకూడదు.అధిక ఉప్పును వాడటం వల్ల శరీరానికి సోడియం అధికంగా అంది,దానిని మన బాడీ ఫిల్టర్ చేయలేదు.దానితో అనేక అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది.ముఖ్యంగా బీపీ, గుండె సమస్యలు,కిడ్నీ సమస్యలు,వెరికోస్,నెగటివ్ మైండ్ సెట్,బ్రెయిన్ స్ట్రోక్,కీళ్ళనొప్పులు వంటివి అధికమవుతాయి.దీనితో పుచ్చకాయలోని లవణాల శోషణ కూడా జరగదు.కావున పుచ్చకాయ తినేటప్పుడు ఉప్పు వేసుకోకూడదు.
చక్కర వేసుకోవడం..
కొంతమంది పుచ్చకాయ తినేటప్పుడు లేదా జ్యూస్ చేసుకునే సమయంలో చక్కెరను ఎక్కువగా వాడుతూ ఉంటారు.మనం సాధారణంగా అర కేజీ పుచ్చకాయ తిన్న సరే గంటలో జీర్ణమై రక్తంలోకి కలిసిపోతుంది. అలాంటప్పుడు మనం చక్కెరలు ఎక్కువగా వాడటం వల్ల తొందరగా బ్లడ్ లోకి కలిసిపోయి గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి.దీనితో టైప్ 2 డయాబెటిస్,పెరాలసిస్, ఒబెసిటీ,అన్ కంట్రోల్ మైండ్ సెట్,హైపర్ టెన్షన్ వంటి దీర్ఘకాలిక రోగాలు వస్తాయి.కావున ఈసారి పుచ్చకాయ తినేటప్పుడు ఈ రెండు తప్పులను అస్సలు చేయకండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: