తక్కువ ఖర్చులో వేసవి తాపాన్ని తగ్గించే డ్రింక్స్ ఇవే..!

Divya
వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల చాలామంది కళ్ళు తిరగడం, నీరసంగా ఉండడం,సన్ స్ట్రోక్, జ్వరం,వాంతులు,విరేచనాలతో ఎక్కువగా బాధపడుతూ ఉంటారు.వీటన్నిటికీ కారణం శరీరంలో నీటి శాతం తగ్గటమే.ఈ వేసవి సమస్యలు పోగొట్టుకోవడానికి,ఎక్కువగా నీటిని తీసుకుంటూ, దానితో పాటు శరీరానికి తగిన మినరల్స్ అందడానికి కొన్ని రకాల జ్యూస్ లు తీసుకోవడం చాలా ముఖ్యం. కానీ చాలామంది అధిక ఖర్చు పెడుతూ కెమికల్ తో తయారు చేసిన జ్యూస్ లో తాగుతూ ఉంటారు. వీటి వల్ల అప్పటికప్పుడు ప్రయోజనం కలిగిన,తరువాత అనేక దుష్ప్రభావాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వీటన్నిటికీ బదులుగా తక్కువ ఖర్చులు సహజంగా దొరికే పండ్లతో చేసిన డ్రింక్స్ చాలా బాగా ఉపయోగపడతాయి.మరియు వీటి వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కలగవు.వేసవి తాపాన్ని తక్కువ ఖర్చులో తొలగించే డ్రింక్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..
మజ్జిగ..
మజ్జిగ ప్రతి ఒక్కరి ఇళ్లలో అందుబాటులో ఉంటాయి. వీటిని ఒక గ్లాసు చొప్పున,ఇంగువ వేసుకొని తాగటం వల్ల వాంతులు,వీరేచనాల నుండి విముక్తి కలిగి,తక్షణ శక్తి లభిస్తుంది.మరియు వీటిని తరుచూ తీసుకోవడం వల్ల జీర్ణక్రియకు తోడ్పడే మంచి బ్యాక్టిరియా పెంచి జీర్ణ సమస్యలు రాకుండా కాపాడుతుంది.
నిమ్మరసం, తేనే..
నిమ్మరసం తేనే కలిపి తీసుకోవడం వల్ల,వేసవి తాపాన్ని తొలగించడమే కాక రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది.తేనెలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, శరీరం అనారోగ్యం బారిన పడకుండా కాపాడుతుంది.
పుచ్చకాయ జ్యూస్..
పుచ్చకాయ జ్యూస్ ను తేనె కలుపుకొని తరుచూ ఒక గ్లాస్ తీసు కోవడం వల్ల,తక్షణమే శక్తి లభించి నీరసం, నిస్సత్వను తొందరగా పోగొడుతుంది.మరియు ఇందులో ఉన్న అధికంగా ఉన్న వాటర్ కంటెంట్ శరీరం డిహైడ్రేషన్ కాకుండా కాపాడుతుంది.
కొబ్బరి నీళ్ళు..
కొబ్బరినీళ్లను రోజు ఉదయాన్నే తీసుకోవడం వల్ల, శరీరానికి కావాల్సిన మినరల్స్ అంది,వేసవిలో వచ్చే సమస్యలు రాకుండా కాపాడుతుంది.
సబ్జా గింజలు..
సబ్జా గింజలను వేసవిలో రోజు తీసుకోవడం వల్ల,శరీరం డీహైడ్రేషన్ కాకుండా కాపాడటమే కాక,రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: