కంటి చుట్టూ నల్లటి వలయాలను తగ్గించే టిప్?

Purushottham Vinay
కంటి చుట్టూ నల్లటి వలయాలను తగ్గించడం కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఖరీదైన క్రీమ్ ఇంకా సీరం లు కొనాల్సిన అవసరం కూడా అక్కర్లేదు. కేవలం నిమ్మ తొక్కలతో ఈ సమస్యను సులభంగా తగ్గించవచ్చు.ఎందుకంటే నల్లటి వలయాలను నివారించే సామర్థ్యం నిమ్మ తొక్కలకు ఉంది. మరి ఇంతకీ నిమ్మ తొక్కలను ఎలా వాడాలో  ఇప్పుడు మనం తెలుసుకుందాం.ముందుగా రెండు నిమ్మ పండ్లని తీసుకుని ఉప్పు నీటిలో వాటిని బాగా శుభ్రంగా కడిగి పైన ఉండే తొక్కను సపరేట్ చేసుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో నిమ్మ తొక్కలని వేసుకోవాలి. అలాగే ఒక కప్పు రోజ్ వాటర్ని కూడా వేసుకుని స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. ఇక ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుండి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్ ని వేసుకోవాలి.


ఇంకా అలాగే మూడు టేబుల్ స్పూన్లు లెమన్ పీల్ జ్యూస్ వేసుకొని ఐదు నిమిషాల పాటు దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. చివరిగా రెండు లేదా మూడు చుక్కలు లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ ని వేసి అన్నీ కలిసేలా మరోసారి కలుపుకోవాలి.ఇక ఇప్పుడు ఈ క్రీమ్ ను ఒక బాక్స్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి. రోజు రాత్రి నిద్రించే ముందు ఈ క్రీమ్ ను కళ్ళ చుట్టూ అప్లై చేసుకొని కనీసం ఐదు నిమిషాల పాటు సాఫ్ట్ గా మసాజ్ చేసుకుని నిద్రించాలి. రెగ్యులర్ గా ఇలా చేస్తే కొద్ది రోజుల్లోనే నల్లటి వలయాలు ఈజీగా మాయం అవుతాయి. ఇంకా అలాగే కళ్ళ వద్ద ఉన్న ముడతలు కూడా ఈజీగా మాయం అవుతాయి.కాబట్టి నల్లటి వలయాలతో ఎవరైతే ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారో వారు తప్పకుండా ఇలా నిమ్మ తొక్కలతో పైన చెప్పిన విధంగా క్రీమ్ ను తయారు చేసుకొని వాడేందుకు ట్రై చెయ్యండి. ఖచ్చితంగా మంచి రిజల్ట్ ను మీరు సొంతం చేసుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: