ముఖంపై గ్లాసీ లుక్ కోసం ఇ చిట్కా చేసి చుడండి..!

Divya
సాధారణంగా వేసవికాలంలో ముఖంపై జిడ్డు పేరుకుపోయి,చర్మ రంద్రాలు మూసుకుపోతాయి.దీని వలన టాన్,మొటిమలు,మచ్చలు,ముడతలు వంటివి రావడంతో ముఖం కాంతి విహీనంగా తయారవుతుంది. ఈ సమస్యలను తగ్గించుకోవడానికి రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ఫలితం ఇవ్వక పోగా,వాటిని మరింత ఎక్కువయ్యేందుకు దోహదం చేస్తున్నాయి. వీటిని పోగొట్టి,మొఖం గ్లాసీ లుక్ పొందడానికి సహజంగా దొరికే పదార్థాలు బాగా ఉపయోగపడతాయి.వీటితో తయారుచేసుకొనే చిట్కాలు ముఖం కాంతివంతంగా మారటానికి అద్భుతంగా పనిచేసి,అవి ముఖంపై ఉన్న జిడ్డును సులభంగా పోగొడతాయి.అలాంటి చిట్కా ఎలా తయారుచేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
దీని కోసం కేవలం 3 పదార్థాలు సరిపోతాయి.ఇవన్నీ మనకు ఇంట్లోనే,తక్కువ ఖర్చులో దొరికేవే.అవి ఏంటంటే కలబంద గుజ్జు,టమోటాలు,విటమిన్ఈ క్యాప్సిల్స్ .
తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో 2 స్పూన్ల టమోటా గుజ్జు,2 స్పూన్ల కలబంద గుజ్జు మరియు విటమిన్ E ట్యాబ్లేట్ తీసి అందులోని ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఇలా వచ్చిన మిశ్రమాన్ని ముఖము,మేడ భాగంపై అప్లై చేసి ఆరనివ్వాలి.అది బాగా ఆరిన తర్వాత మైల్డ్ సోపుతో మర్దన చేస్తూ,గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఆ తర్వాత మాయిశ్చరైజర్ రాయాలి లేదంటే ఆ ప్యాక్ అప్లై చేసినా తరవాత చర్మం పై రంద్రాలు ఓపెన్ అయి ఉంటాయి.వాటిపై మళ్ళీ దుమ్ము, ధూళి చేరితే మొటిమలు,మచ్చలు వచ్చే అవకాశం ఉంటుంది.కావున మాయిశ్చరైజర్ తప్పక రాయాలి.
ఈ విధంగా  వారానికి మూడు సార్లు అప్లై చేస్తూ ఉంటే రానురాను అధికంగా ఓపెన్ అయిన చర్మ రంద్రాలు ముసుకు పోయి,టాన్, మొటిమలు, మచ్చలు, ముడుతలను పోగొట్టి, ముఖం గ్లాసీ లుక్ నీ పొందుతుంది.ఇందులో వాడిన విటమిన్ E ట్యాబ్లేట్, ప్రతి మందుల షాప్ లలో తక్కువ ఖర్చుకే లభిస్తుంది. ఇది చర్మం మృదువుగా తయారు చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.కలబంద గుజ్జు ముడుతాలు రాకుండా ఉండేందుకు దోహదపడుతుంది. విటన్నింటితో పాటు చర్మం డీ హైడ్రెషన్ కాకుండా నీటిని ఎక్కువగా తీసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: