15 రోజుల్లో అధిక బరువు తగ్గాలంటే ఇలా చెయ్యండి?

Purushottham Vinay
ఈ రోజుల్లో స్థూలకాయం, అధిక బరువు, అధిక పొట్ట వంటి  సమస్యలు చాలా ఎక్కువ అయిపోతున్నాయి. ఈ సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఈ సమస్యలను నిర్లక్ష్యం చేస్తే గుండెపోటు, అధిక రక్తపోటు ఇంకా షుగర్ వంటి ఇతర అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి మనం సాధ్యమైనంత త్వరగా ఈ సమస్యల నుండి బయటపడడం ఆరోగ్యానికి చాలా మంచిది.చాలా మంది అధిక బరువును తగ్గించుకోవడానికి ఎన్నో రకాల అనారోగ్య పద్దతులను పాటిస్తూ ఉంటారు. వారు సరిగ్గా ఆహారాన్ని తీసుకోకుండా బరువు తగ్గాలని ప్రయత్నిస్తూ ఉంటారు.అందువల్ల ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అయితే ఎలాంటి డైటింగ్ పద్దతులు పాటించకుండా చక్కటి ఆహారాన్ని తీసుకుంటూ మన ఇంట్లో ఉండే పదార్థాలతో ఒక డ్రింక్ ని తయారు చేసుకుని వాడడం వల్ల మనం చాలా సులభంగా అధిక పొట్టను ఇంకా స్థూలకాయాన్ని తగ్గించుకోవచ్చు. శరీర బరువును పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వును కరిగించే ఆ డ్రింక్ ని ఎలా తయారు చేసుకోవాలి…ఎలా వాడాలి..వంటి పూర్తి వివరాలను  తెలుసుకుందాం. దీనిని తయారు చేసుకోవడానికి  మనం ఒక పెద్ద టమాటను, ఒక ఇంచు అల్లం ముక్కను, అర టీ స్పూన్ మిరియాల పొడిని ఇంకా అలాగే అర చెక్క నిమ్మరసాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది.


ముందుగా టమాటకాయను తీసుకొని ముక్కలుగా చేసుకోవాలి. అలాగే అల్లాన్ని కూడా తీసుకొని దంచాలి.ఇప్పుడు ఈ రెండింటిని ఒక జార్ లో వేసి ముప్పావు గ్లాస్ నీళ్లు పోసి వాటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.ఆ తరువాత ఈ మిశ్రమాన్ని ఒక గ్లాస్ లోకి తీసుకుని అందులో మిరియాల పొడి ఇంకా నిమ్మరసం వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న డ్రింక్ ని రోజూ ఉదయం పరగడుపున తాగాలి. ఇంకా అలాగే దీనిని తాగిన గంట దాకా ఎలాంటి ఆహారాన్ని తీసుకోకూడదు. ఈ విధంగా ఈ డ్రింక్ ని క్రమం తప్పకుండా రెండు నెలల పాటు తీసుకోవాలి. దీనిని తీసుకోవడం మొదలు పెట్టిన 15 రోజుల్లోనే మనం మన శరీరంలో వచ్చిన మార్పును ఈజీగా గమనించవచ్చు. అదే విధంగా ఈ డ్రింక్ ని తీసుకుంటున్న సమయంలో నీటిని ఎక్కువగా తాగాలి. ప్రతిరోజూ ఖచ్చితంగా ఒక 45 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. జంక్ ఫుడ్ ను ఇంకా నూనెలో వేయించిన పదార్థాలను ఎక్కువగా తీసుకోకూడదు. ఈ విధంగా ఈ టిప్ ని పాటించడం వల్ల మనం చాలా సులభంగా ఇంకా ఆరోగ్యవంతంగా బరువు తగ్గవచ్చు.అలాగే పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వును, శరీరంలో పేరుకుపోయిన కొవ్వును చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: