వీటిని రోజూ తీసుకుంటే ఏ జబ్బులు రావు?

Purushottham Vinay
మెంతులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఆయుర్వేదంలో వీటిని వివిధ అనారోగ్య సమస్యలను తగ్గించడంలో చక్కటి ఔషధంగా ఉపయోగిస్తారు. శరీరంలో యాసిడ్ శాతాన్ని తగ్గించడంలో, రక్తహీనతను తగ్గించడంలో మెంతులు చాలా బాగా సహాయపడతాయి.ఇంకా అంతేకాకుండా వీటిలో ఉండే రసాయనాల సమ్మేళనాలు డయాబెటిస్ ను అదుపులో ఉంచడంలో చాలా బాగా సహాయపడతాయి.ఇంకా అలాగే శరీరంలో వాతం పెరిగిపోవడం వల్ల శరీరంలో ఎన్నో రకాల సమస్యలు తలెత్తుతాయి. వాతం పెరిగిపోవడం వల్ల వెన్ను నొప్పి, కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు ఇంకా మెడ నొప్పి వంటి చాలా రకాల సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి సమస్యలతో బాధపడే వారు ఖచ్చితంగా ప్రతిరోజూ మెంతులను తప్పకుండా తీసుకోవాలి. అయితే మెంతులు ఒక పెయిన్ కిల్లర్ లాగా పని చేసి నొప్పులను తగ్గించడంలో ఉపయోగపడతాయి. జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో ఇంకా జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో కూడా మెంతులు సహాయపడతాయి. మన ఆరోగ్యానికి బాగా మేలు చేసే ఈ మెంతులను మనం నానబెట్టి తీసుకోవాలి. అలాగే రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ మెంతులను వేసి నానబెట్టాలి. వేసవి కాలంలో లేదా వేడి శరీరతత్వం ఉన్న వారు అయితే అర టీ స్పూన్ మెంతులను మాత్రమే ఉపయోగించాలి. ఇలా నానబెట్టిన మెంతులను నీటితో సహా గిన్నెలో వేసుకొని వేడి చేయాలి.ఆ తరువాత ఈ నీటిని తాగి మెంతులను నమిలి తినాలి. ఇలా చేయడం వల్ల మనం ఖచ్చితంగా చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. అలాగే దాల్చిన చెక్కను వాడడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. 


ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో, రక్తనాళాల్లో అడ్డంకులను తొలగించడంలో ఇంకా అలాగే బరువు తగ్గడంలో దాల్చిన చెక్క చాలా బాగా సహాయపడుతుంది. ఇది చర్మ సమస్యలను తగ్గించడంలో, శరీరంలో ఎక్కువగా ఉన్న వాతాన్ని తగ్గించడంలో,ఎసిడిటీ సమస్యను తగ్గించడంలో, కాళ్లు ఇంకా చేతుల్లో తిమ్మిర్లు రావడాన్ని తగ్గించడంలో ఇలా చాలా విధాలుగా దాల్చిన చెక్క  సహాయపడుతుంది.ఈ దాల్చిన చెక్కను పొడిగా చేసి స్టోర్ చేసుకోవాలి. ప్రతిరోజూ ఉదయం పూట అల్పాహారం చేయడానికి అరగంట ముందు పావు టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని ఇంకా ఒక టేబుల్ స్పూన్ తేనెతో కలిపి తీసుకోవాలి లేదా దాల్చిన చెక్కతో టీ ని తయారు చేసుకుని తీసుకోవడం వల్ల కూడా మనం ఖచ్చితంగా చాలా మంచి ఫలితాలను సొంతం చేసుకోవచ్చు. ఇక అలాగే మనం తీసుకోవాల్సిన మూడో పదార్థం వెల్లుల్లి రెబ్బలు. మనం వంటల్లో వీటిని  ఉపయోగిస్తూ ఉంటాం. వెల్లుల్లిలో చాలా ఔషధ గుణాలు ఉంటాయి.ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో, రక్తాన్న పలుచగా చేయడంలో, రక్తపోటును అదుపులో ఉంచడంలో, అలాగే శరీరంలో కొలెస్ట్రాల్ ఇంకా ట్రై గ్లిజరాయిడ్ స్థాయిలను అదుపులో ఉంచడంలో ఇలా చాలా రకాలుగా వెల్లుల్లి మనకు సహాయపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: