పొట్ట తగ్గి అందంగా అయ్యే సింపుల్ టిప్?

Purushottham Vinay
నిద్రపోయేటప్పుడు తగిన జాగ్రత్తలను తీసుకుంటూ  ఒక సింపుల్ చిట్కాను పాటించడం వల్ల మనం చాలా సులభంగా బరువు తగ్గవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నిద్రపోయే ముందు పాటించాల్సిన నియమాలు అలాగే టిప్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రాత్రి పడుకునే ముందు భోజనాన్ని ఖచ్చితంగా త్వరగా చేయాలి. అలాగే భోజనాన్ని కేవలం తక్కువగా మాత్రమే తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల శరీరంలో ఉన్న కొవ్వు అనేది త్వరగా తగ్గుతుంది. అలాగే ఈ చెప్పే ఒక చిట్కాను పాటించాలి. ఈ చిట్కాను పాటించడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు చాలా వేగంగా కరిగిపోతుంది. ఈ టిప్ ని పాటించడం కూడా చాలా సులభం. అలాగే దీనిని మనం తయారు చేసుకుని స్టోర్ కూడా చేసుకోవచ్చు. అధిక బరువును తగ్గించే ఈ టిప్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఈ టిప్ తయారు చేసుకోవడానికి  25 గ్రా. అవిసె గింజలను, 25 గ్రా. జీలకర్రను, 50 గ్రా. అవిసె గింజలను, అర టేబుల్ స్పూన్ పసుపును, 25 గ్రా. కరివేపాకు పొడిని, 25 గ్రా. కరక్కాయ పొడిని, అర టేబుల్ స్పూన్ సైందవ లవణాన్ని ఇంకా అలాగే 2 చిటికెల ఇంగువను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా మీరు కళాయిలో అవిసె గింజలను వేసి దోరగా వేయించాలి.


ఇక వీటిని ప్లేట్ లోకి తీసుకున్న తరువాత జీలకర్రను ఇంకా సోంపు గింజలను  విడివిడిగా వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత వేయించిన పదార్థాలతో పాటు మిగిలిన పదార్థాలను కూడా జార్ లో వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా తయారు చేసిన పొడిని గాజు సీసాలో  స్టోర్ చేసుకోవచ్చు. ఇలా తయారు చేసిన పొడిని రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ వేడి నీటిలో పావు టేబుల్ స్పూన్ డోస్ లో కలిపి తీసుకోవాలి.ఇక నీళ్లు గోరు వెచ్చగా కంటే కొద్దిగా వేడి ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇలా ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు తీసుకోవడం వల్ల మనం చాలా ఈజీగా బరువు తగ్గవచ్చు. బరువు ఇంకా ఎక్కువ ఉన్న వారు దీనిని రోజూ మూడు పూటలా పావు టేబుల్ స్పూన్ మోతాదులో భోజనం చేసిన గంట తరువాత తీసుకోవాలి. ఇంకా అలాగే ఈ పొడిని తీసుకునేటప్పుడు ఎలాంటి జంక్ ఫుడ్ ను తీసుకోకూడదు. ఖచ్చితంగా వ్యాయామం చేయాలి. తీపి పదార్థాలకు ఇంకా నూనెలో వేయించిన పదార్థాలకు ఖచ్చితంగా దూరంగా ఉండాలి. ఈ విధంగా ఈ టిప్ ని రాత్రి పడుకునే ముందు పాటించడం వల్ల చాలా సులభంగా బరువు తగ్గవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: