వేసవి కాలంలో.. ఆటో డ్రైవర్ వినూత్న ఆలోచన?

praveen
మండే వేసవికాలం మొదలైంది.. దీంతో తీవ్రమైన ఎండలను చూసి ఇంటి నుంచి కాలు బయటపెట్టాలంటేనే ప్రతి ఒక్కరు భయపడిపోతున్నారు అని చెప్పాలి. ఎందుకంటే ఎక్కడ వడదెబ్బ తగిలి ప్రాణాలు పోతాయేమో అని భయపడిపోతున్నారు. ఇక ఆఫీసులకు వెళ్లేవారు ఇక ఏదో ఒక విధంగా జాగ్రత్తలు వహిస్తూ ఇక ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నారు అని చెప్పాలి. ఇక ఎండ వేడిమికి ఎంత ఏసీలో ఉన్న ఎవరికి దప్పిక తీరడం లేదు. అలాంటిది ఏకంగా ఇక  మండుటెండలో ప్రయాణం సాగిస్తున్న వారు ఇక గొంతు ఎండిపోయి ఎంతలా ఇబ్బంది పడుతూ ఉంటారు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

 ఈ క్రమంలోనే  ప్రతి ఒక్కరు ముందు జాగ్రత్తల్లో భాగంగా తమ వెంట ఒక వాటర్ బాటిల్ పెట్టుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఇలా వాటర్ బాటిల్ పెట్టుకోకుండా ప్రయాణాలు చేస్తున్న వారికి ఇక్కడ ఒక ఆటో డ్రైవర్ మాత్రం వినూత్న రీతిలో సహాయం చేసేందుకు సిద్ధమయ్యాడు. ఏకంగా వాటర్ బాటిల్ తో పాటు స్నాక్స్ కూడా తమ ఆటోలో ఎక్కే కస్టమర్స్ కోసం అందుబాటులోకి తీసుకోవచ్చాడు. సాధారణంగానే మహానగరాల్లో ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వెళ్లాలి అంటే ట్రాఫిక్ అనే ఒక పెద్ద సమస్య ఎదురవుతూ ఉంటుంది.

 ఈ ట్రాఫిక్ సమస్యను ఎదుర్కొని వెళ్ళాలి అంటే గంటల సమయం వేచి చూడక తప్పదు. ఈ క్రమంలోనే ఎండాకాలంలో ఇలా ప్రయాణాలు చేస్తున్న వారు ఎంతో మంది గొంతు ఎండిపోయి దాహంతో విలవిలలాడిపోతూ ఉంటారు. ఇక అలాంటివారి కోసం ముంబై కు చెందిన ఒక ఆటో డ్రైవర్ ఏకంగా ప్యాసింజర్లకు టైం పాస్ అయ్యేందుకు ఆటోలో బిస్కెట్స్ తో పాటు ఫ్రీ వాటర్ బాటిల్ను కూడా అందుబాటులో ఉంచాడు. ఇక అతని ఆటోలో ప్రయాణించిన ఒక యువతి ఇందుకు సంబంధించి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: