తొందరగా సన్నబడటానికి ఉపయోగపడే ఆహారాలు ..?

Divya
ఇప్పుడున్న పరిస్థితులు,ఆహారపు అలవాట్లు,జీవన శైలి కారణంగా చాలామంది అధిక బరువు, ఉబకాయం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. అధిక బరువు తగ్గించుకొని సన్నబడటానికి రకరకాల డైట్ లు ఫాలో అయి విసిగిపోతుంటారు. కానీ కొన్ని రకాల ఆహారాలు తీసుకోవడం వల్ల తొందర గా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సన్నబడవచ్చు అని వైద్య నిపుణులు పరిశోధన చేసి మరీ నిరూపించారు. ఇలాంటి ఆహారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
కాన్ బెర్రీ..
కాన్ బెర్రీ ఎక్కువగా తీసుకోవడం వల్ల,అందు లో ఫైబర్,యాంటీ యాక్సిడెంట్,విటమిన్ సి పుష్కలంగా లభిస్తాయి.ఇవి శరీరంలో  అధికంగా ఉన్న వాటర్ ని తొలగించి తొందరగా సన్నబడేలా చేస్తాయి. అంతే కాక యూరినరి ఇన్ఫెక్షన్,కిడ్నీ ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతాయి.
అల్లం..
 మనం రోజు వారి ఆహారంలో అల్లం తీసుకోవడం వల్ల,శరీరాన్ని డీటాక్స్ చేసి అధికంగా ఉన్న టాక్సిన్స్ని మూత్రం రూపంలో తొలగి స్తుంది. దీంతో కూడా తొందరగా బరువుని తగ్గించు కోవచ్చు.మరియు జీర్ణ క్రియను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది
కీరదోస..
కీరదోసలో హై వాటర్ కంటెంట్ ఉండడం వల్ల,మన శరీరంలోని టాక్సిన్స్ అన్ని రిమూవ్ చేసి చెడు కొలెస్ట్రాన్ని తొలగిస్తుంది.అంతేకాక ఇందులోని కెపికేట్ ఆసిడ్ అధికంగా ఉన్న వాటర్ ని కూడా తొలగించడానికి ఉపయోగపడే అధిక బరువును తొందరగా తొలగించడానికి సహాయపడుతుంది.
పుచ్చకాయ..
పుచ్చకాయలో 92% నీరు ఉండడం వల్ల,
సమ్మర్ ఫుడ్ గా పని చేస్తుంది. ఇందులో ఉన్న అధిక ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ను కరిగించి శరీర బరువును తగ్గించడంలో ఉపయోగపడతాయి. అంతేకాక వేసవిలో శరీరం డిహైడ్రేషన్ కాకుండా కాపాడుతుంది.
నిమ్మకాయ..
నిమ్మకాయతో కషాయం కానీ,టీ కానీ చేసుకొని తాగడం వల్ల, అధికంగా ఉన్న బెల్లీ ఫ్యాట్ ని సులభంగా  తగ్గించడంలో  బాగా సహాయపడుతుంది.ఇందులోని విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్స్ ఇమ్యూనిటీ పవర్ ను పెంచడమే కాకుండా, శరీరం నుండి టాక్సిన్స్ ను రిమూవ్ చేయడానికి కూడా ఉపయోగపడి,తొందరగా బరువు తగ్గడానికి దోహదపడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: