మహిళలు చేసే ఈ ఐదు తప్పుల వల్ల pcos సమస్య వస్తుందా..?

Divya
పెళ్లయిన ప్రతి స్త్రీ గర్భం దాల్చాలని,బిడ్డకు జన్మనివ్వాలని కోరుకుంటూ ఉంటుంది.కొందరికి పెళ్లయిన వెంటనే పిల్లలు కలుగుతారు కానీ, మరికొంతమందిలో గర్భం దాల్చకుండా pcos సమస్య అడ్డుపడుతూ ఉంది. అసలు pcos అంటే పాలిస్టిక్ ఓవరీ సిండ్రోమ్. ఈ సమస్య మహిళల్లో ఆండ్రోజన్,ఇన్సులిన్,ప్రొజెస్టిరాన్ అనే హార్మోన్లను ప్రభావితం చేస్తుంది. దీంతో స్త్రీలు గర్భం దాల్చే అవకాశాలు రోజురోజుకీ తగ్గిపోతున్నాయి. ఇలాంటి సమస్యలకు రోజువారి వ్యవహారంలో స్త్రీలు చేసి ఈ ఐదు తప్పులే కారణమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ తప్పులేంటో ఇప్పుడు చూద్దాం..
అధికంగా తినడం..
కొంతమంది ఎప్పుడూ  తింటూనే ఉంటారు. ఇలాంటి వారిలో గ్లూకోజ్ లెవెల్స్ అధికంగా ఉత్పత్తి అయి, ఇన్సులిన్ తయారవ్వడాన్ని ప్రభావితం చేస్తుంది. దీనితో pcos సమస్య తలెత్తి గర్భం దాల్చకుండా అడ్డుపడుతుంది. కావున ప్రతి ఒక్కరూ సమయానుసారం తినడం అలవాటు చేసుకోవాలి.
నిద్రలేమి..
పని ఒత్తిడి, ఆందోళన,ఎలక్ట్రిక్ గాడ్జెట్స్ చూడటం వంటి కారణాల వల్ల నిద్రలేమి కలుగుతుంది. దీనితో మన హార్మోనల్ వ్యవస్థ సరిగా పనిచేయక, pcos తలెత్తడానికి దోహదం చేస్తుంది. కావున ప్రతి ఒక్కరూ కనీసం ఎనిమిది గంటలు నిద్రపోయేలా  చూసుకోవాలి.
గర్భ నిరోధక మాత్రలు వాడటం..
కొంతమంది పెళ్లయిన వెంటనే గర్భం దాల్చడానికి అంతగా ఇష్టపడరు. అలాంటివారు గర్భం నిరోధించడానికి మాత్రలు వాడుతుంటారు. వీటివల్ల ఆ సమస్య తీరినా pcos సమస్య పెరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
బేకరీ ఫుడ్స్ తినడం వల్ల..
స్వీట్లు,కేకులు వంటి బేకరీ ఫుడ్స్ ని ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలోని గ్లూకోస్ లెవెల్స్ పెరిగి ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి. కావున బేకరీ ఫుడ్స్ కి దూరంగా ఉండడం చాలా మంచిది.
మంచి కొవ్వులు..
మన శరీరానికి శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ చాలా అవసరం. కానీ కొన్ని రకాల డైట్ లో తీసుకోవడం వల్ల చెడు కొవ్వులతోపాటు,శాచురేటెడ్ ఫ్యాట్స్ కూడా ప్రాసెస్ చేయబడతాయి. అలాంటి ఆహారాలు ఎక్కువగా తీసుకున్న వారికి కూడా pcos సమస్య తలెత్తుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: