జీర్ణ సమస్యలని తగ్గించే సూపర్ డ్రింక్ ఇదే?

Purushottham Vinay
ఒక సూపర్ టిప్ ని పాటించడం వల్ల మనం కడుపులో మంట, గొంతులో మంట, గ్యాస్, మలబద్దకం, త్రేన్పులు ఎక్కువగా రావడం, అజీర్తి వంటి చాలా రకాల జీర్ణ సమస్యలన్నీటిని ఈజీగా తగ్గించుకోవచ్చు.ఇంకా అంతేకాకుండా ఈ టిప్ ని వాడడం వల్ల అరికాళ్లు, అరిచేతుల్లో మంటలతో పాటు సూదులు గుచ్చినట్టు ఉండడం, కళ్లల్లో మంటలు, తలనొప్పి ఇంకా నోటిలో అల్సర్లు వంటి సమస్యలన్నీ తగ్గుతాయి. మన జీర్ణసమస్యలన్నింటిని దూరం చేసే ఈ టిప్ ని ఎలా తయారు చేసుకోవాలి? ఇంకా దాని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి? ఇంకా అలాగే అలాగే ఈ చిట్కాను ఎలా వాడాలి? వంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ టిప్ ని తయారు చేసుకోవడానికి  మనం సోంపు గింజలను ఉపయోగించాల్సి ఉంటుంది. జీర్ణశక్తిని మెరుగుపరచడంలో ఇంకా శరీరంలో వేడిని తగ్గించి శరీరాన్ని చల్లబరచడంలో సోంపు చాలా బాగా సహాయపడుతుంది.అలాగే మనం ఉపయోగించాల్సిన మరో పదార్థం జీలకర్ర. ఇది గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్దకం వంటి సమస్యలను ఈజీగా తగ్గించి జీర్ణశక్తిని మెరుగుపరచడంలో చాలా సహాయపడుతుంది.


ఇంకా అలాగే మనం ఉపయోగించాల్సిన మరో పదార్థం ధనియాలు. ఇవి శరీర ఉష్ణోగ్రతలను తగ్గించి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇంకా జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేయడంలో అలాగే మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ధనియాలు ఎంతో ఉపయోగపడతాయి. ఈ మూడు పదార్థాలను ఉపయోగించి ఈ కషాయాన్ని తయారు చేసి తీసుకోవడం వల్ల మనం జీర్ణ సమస్యలన్నింటిని దూరం చేసుకోవచ్చు. ఈ కషాయాన్ని తయారు చేసుకోవడానికి  ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని తీసుకోవాలి. ఆ తరువాత ఇందులో ఒక టీ స్పూన్ సోంపు గింజలు, అర టీ స్పూన్ జీలకర్ర ఇంకా అర టీ స్పూన్ ధనియాలు వేసి కలపాలి.తరువాత ఈ దినుసులను రాత్రంతా నానబెట్టి పొద్దున్నే ఈ నీటిని 2 నిమిషాల పాటు మరిగించి వడకట్టుకుని గ్లాస్ లోకి తీసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న నీటిని ప్రతి రోజూ ఉదయం పరగడుపున తాగడం వల్ల జీర్ణ సమస్యలన్నీ చాలా ఈజీగా దూరమవుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: