ముఖ సౌందర్యాన్ని రెట్టింపు చేసుకునే టిప్?

Purushottham Vinay
ముఖ సౌందర్యాన్ని రెట్టింపు చేసుకునే టిప్?

టమాటాని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం ఖచ్చితంగా చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.  దీనితో కేవలం మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాదు  మన అందాన్ని కూడా మెరుగుపరుచుకోవచ్చు. ఎందుకంటే టమాటలో ఉండే పోషకాలు మన ముఖంపై ఉండే నలుపును చాలా సులభంగా తొలగించి చర్మాన్ని అందంగా, ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతగానో సహాయపడతాయి. అయితే టమాటను ఏ విధంగా ఉపయోగించడం వల్ల మనం చక్కటి అందాన్ని సొంతం చేసుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఈ న్యాచురల్ టిప్ ని తయారు చేసుకోవడానికి  మనం ముందుగా ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ పంచదారను తీసుకోవాలి. ఆ తరువాత ఇందులో ఒక టీ స్పూన్ బియ్యం పిండిని వేసి కలపాలి.ఇక ఇప్పుడు అర చెక్క టమాటకాయను తీసుకుని దానిని పంచదార మిశ్రమంలో ముంచాలి. ఆ తరువాత టమాటకాయను పిండుతూ ఆ మిశ్రమాన్ని మీ ముఖానికి రాసుకోవాలి. 


ఇలా రాసుకున్న తరువాత టమాటకాయతోనే ఒక 3 నుండి 4 నిమిషాల పాటు బాగా మసాజ్ చేసుకోవాలి.ఇంకా ఈ మిశ్రమం ఆరిన తరువాత సాధారణ నీటితో బాగా శుభ్రం చేసుకోవాలి. ఈ న్యాచురల్ చిట్కాను రాత్రి పడుకునే ముందు ఉపయోగించి ఉదయాన్నే సబ్బుతో ముఖాన్ని బాగా శుభ్రం చేసుకోవాలి.ఇక ఈ విధంగా ఈ టిప్ ని వారానికి రెండు నుండి మూడుసార్లు వాడడం వల్ల ముఖంపై ఉండే మృతకణాలు చాలా సులభంగా ఈజీగా తొలగిపోతాయి. ఇంకా అలాగే చర్మ రంధ్రాల్లో పేరుకుపోయిన మురికి కూడా చాలా ఈజీగా తొలగిపోతుంది.ఇంకా అలాగే ముఖంపై ఉండే నలుపు కూడా ఈజీగా తొలగిపోయి ముఖం చాలా అందంగా, ప్రకాశవంతంగా తయారవుతుంది. ఈ విధంగా టమాట పండుని ఉపయోగించి మనం చాలా సులభంగా ముఖ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు.కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్ పాటించండి. ముఖ సౌందర్యాన్ని రెట్టింపు చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: