గొంతు నొప్పి వేధిస్తే ఇలా చెయ్యండి?

Purushottham Vinay
మిమ్మల్ని గొంతు నొప్పి కనుక ఎక్కువగా వేధిస్తూ ఉంటే ఖచ్చితంగా లవంగాలను నమలాలి.అలాగే నోట్లో పగుళ్లు, పుళ్లు అయితే లవంగాలను నోట్లు వేసుకుని ఉంచుకోవాలి.అందువల్ల మీకు ఖచ్చితంగా ఆ సమస్య నుంచి చాలా ఈజీగా ఉపశమనం కలుగుతుంది.ఇంకా అలాగే అర టీస్పూన్ రాళ్ల ఉప్పును గోరువెచ్చని నీటిలో కరిగించి పుక్కిలించాలి. ఇది ఖచ్చితంగా మీ గొంతులో వాపును తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది.ఇంకా అంతేగాక ఇది శ్లేష్మం పోవడానికి కూడా సహాయపడుతుంది.అలాగే హెన్నా ఆకులతో డికాక్షన్ చేసి పుక్కిలించొచ్చు.అలాగే నీళ్లలో యాలకుల పొడిని కరిగించి, వడకట్టి పుక్కిలించిన మంచి ప్రయోజనం ఉంటుంది.ఇంకా అలాగే నీటిలో మరిగించి, వడకట్టి పుక్కిలించాలి.ఇంకా అలాగే గోరువెచ్చని నీళ్లలో ఒక చెంచా తేనె ఇంకా నిమ్మరసం కలుపుకుని తాగాలి.మనం ఈ గొంతు నొప్పి నుండి ఉపశమనం పొందేందుకు తేనె చాలా బాగా సహాయపడుతుంది.అలాగే వెచ్చని ద్రవాలు అనేవి మీ గొంతును తేమ, పొడి గొంతు, నిర్జలీకరణం మొదలైన సమస్యలను నిరోధించడంలో సహాయపడతాయి.


అందుకే గొంతు నొప్పికి మీరు వేడి డ్రింక్స్ తీసుకోవచ్చు.ఇంకా అల్లం, తేనె టీ అనేది గొంతు మంటను తగ్గించడానికి ఒక ప్రసిద్ధమైన డ్రింక్.ఇంకా అంతేగాక రెడ్ హైబిస్కస్ టీ మీ గొంతు నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. రెడ్ హైబిస్కస్ టీలో విటమిన్ సి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది.ఇంకా మీ గొంతు తేమగా ఉండాలంటే ఎప్పటికప్పుడు గోరువెచ్చని నీటిని ఖచ్చితంగా తాగాలి.అలాగే తమలపాకులు ఖచ్చితంగా నమలాలి. ఈ తమలపాకులు గొంతు నొప్పి నుండి ఉపశమనం కలిగించే పురాతన, సాంప్రదాయ ఔషధం. తమలపాకులు, తులసి ఆకులను రెంటిని కూడా నీటిలో వేసి మరిగించవచ్చు.తరువాత వడకట్టి ఆ నీటిని తాగాలి. రుచి కోసం తేనె లేదా ఉప్పును మీరు ఇందులో యాడ్ చేసుకోవచ్చు.కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్స్ పాటించండి. ఈ టిప్స్ పాటించడం ద్వారా ఖచ్చితంగా మీరు గొంతు నొప్పి నుంచి ఈజీగా ఉపశమనం పొందుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: