ప్రోటీన్ లోపంతో బాధపడుతున్నారా..ఇవి తిని చూడండి..!!

Divya
సాధారణంగా మాంసాహారం తినేవారికి తగిన ప్రోటీన్ అంది ఆరోగ్యాంగా వుంటారు. కానీ శాఖహరులకు,వారు తినే ఆహారంలో సరైన ప్రోటీన్ అందక అనేక ఆరోగ్య సమస్యలకు గురవతుంటారు.అటువంటి వారికి
తగిన ప్రోటీన్ అందడానికి ప్రత్యేకించి కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకుంటే సరిపోతుందని ఆహారనిపుణులు సూచిస్తున్నారు. అలాంటి ఆహార పదార్థాలు ఏంటో చూద్దాం..
ప్రోటీన్ ప్రయోజనాలు..
రోజువారి ఆహారంలో తగిన ప్రోటీన్ తీసుకోవడం వల్ల శరీర పెరుగుదలకు,శరీర అవయవాలు సక్రమంగా పనిచేయడానికి కావాల్సిన ఆమైనో ఆసిడ్స్ ని అందిస్తాయి. అంతేకాక మన రోగనిరోధకవ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చేస్తాయి.మరియు శరీరంలో సరైన హార్మోన్స్ విడుదలకు కారణం ఈ ప్రోటీనె. ప్రోటీన్ అధికంగా మాంసాహారం ఉత్పత్తులైన మటన్ చికెన్ గుడ్లు ఫిష్ వంటి వాటిలో లభిస్తాయి.శాఖాహరులు కింద చెప్పినవి తీసుకోవడం వల్ల వారి ప్రోటీన్ లోపాన్ని అదిగమించవచ్చు.
పుట్టగొడుగులు..
రోజువారి ఆహారంలో 250 grms పుట్టగొడుగులు తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన ప్రోటీన్ ఇందులో పుష్కలంగా లభిస్తుంది. శాఖాహారులు దీనిని తినడంతో ప్రోటీన్ లోపాన్ని అదిగమించవచ్చు.
సోయాగింజలు..
సోయాబీన్స్ ను పేదవాడి మాంసం అని చెప్పవచ్చు. వీటిని 100 గ్రాములు మొలకలు కట్టుకొని తినడం వల్ల 11 గ్రామ్స్ ప్రోటీన్ శరీరానికి అందుతుంది. కావున ప్రోటీన్ లోపంతో బాధపడేవారు,వీటిని తినడం వల్ల ప్రోటీన్ పుష్కలంగా లభిస్తుంది.
 వేరుశనగలు..
ప్రోటీన్ లోపంతో బాధపడేవారు 50 grms వేరుశనగలను తరచూ తీసుకోవడం వల్ల 7grms ప్రోటీన్ శరీరానికి అందుతుంది. కావున వీటిని చిక్కి రూపంలో తినడం ఉత్తమం.
లీమాబీన్స్..
 ఇవి చూడటానికి చిక్కుడు గింజల లాగే ఉంటాయి. 100 grms లీమాబీన్స్ ని తీసుకోవడం వల్ల 11 గ్రామ్స్ ప్రోటీన్ లభిస్తుంది.ఇందులో వున్న అమైనోయాసిడ్ కండరాలను బలపరిచి,వృద్ధాప్యఛాయలు రాకుండా కాపాడుతుంది.
 బఠానీలు..
 శాఖాహారులు రోజువారి ఆహారంలో 100 గ్రాముల బఠానీలు తీసుకోవడం వల్ల 5.5grms ప్రోటీన్ అందుతుంది.
 పాలకూర..
పాలకూరను తరచూ తీసుకోవడం వల్ల 100 grms పాలకూరలో 5.8 ప్రోటీన్ లభిస్తుంది.ఇది శాఖాహారులకి సహజమైన ప్రోటీన్ ఉత్పత్తి అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: