సమ్మర్లో ఖచ్చితంగా తాగాల్సిన డ్రింక్స్ ఇవే?

Purushottham Vinay
కొన్ని రకాల డ్రింక్స్ లేదా పానీయాలు వేసవి కాలంలో మండే ఎండల నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.ఈ డ్రింక్స్ మన దాహాన్ని తీర్చడమే కాకుండా శరీరంలోని వేడిని నియంత్రించి మనల్ని బాగా చల్లబరుస్తాయి. ఇంకా అలాగే ఈ ఎండాకాలంలో శరీరానికి కావలసిన పోషకాలను కూడా ఆ డ్రింక్స్ అందించగులుగుతాయి. మరి ఆ డ్రింక్స్ గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.ఈ వేసవి కాలంలో రోడ్డు పక్కన ఏర్పాటు చేసే దుకాణాలలో చెరుకు రసం దుకాణాలు ఎక్కువగా ఉంటాయి. చెరకు, అల్లం ఇంకా నిమ్మకాయలను కలిపి మెత్తగా చేసి పుదీనా కలుపుతారు. ఈ డ్రింక్ సహజ తీపి రుచిని కలిగి ఉంటుంది, ఇంకా అలాగే ఇందులో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఈ డ్రింక్ మనల్ని వేసవి ఎండల నుంచి చాలా ఈజీగా కాపాడగలుగుతుంది. అయితే ఈ డ్రింక్ ని మాత్రం ఐస్ కలపకుండా తాగడం మంచిది. వేసవి కాలంలో మజ్జిగని తాగడం తప్పనిసరి. ఇది మన శరీరాన్ని చల్లబరచడమే కాకుండా జీర్ణవ్యవస్థను కూడా చాలా బాగా మెరుగుపరుస్తుంది. ఇంకా అలాగే మలబద్దకాన్ని నివారిస్తుంది.


అందుకే భోజనం చేసిన తర్వాత ఒక గ్లాసు మజ్జిగ తాగడం వల్ల ఏ కాలంలో అయినా శరీరానికి చాలా రకాలుగా మేలు జరుగుతుంది.అలాగే ఈ వేసవి కాలంలో రోడ్డు పక్కన ఉన్న స్టాల్స్‌లో ఏర్పాటు చేసే మరో ముఖ్యమైన జ్యూస్ పుచ్చకాయ జ్యూస్. ఈ పుచ్చకాయ జ్యూస్ మన దాహం తీర్చడమే కాకుండా శరీరానికి కావలసిన చాలా రకాల పోషకాలను కూడా అందిస్తుంది.ఇంకా అలాగే వేసవి కాలంలో తప్పనిసరిగా తీసుకోవలసిన డ్రింక్ ఏమైనా ఉంది అంటే అది కొబ్బరి నీరే.ఎందుకంటే దీనిలోని పోషకాలు మన శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను కల్సిస్తాయి. వేసవి కాలంలో ఉదయాన్నే కొబ్బరినీళ్లు తాగడం వల్ల శరీరం రోజంతా కూడా చల్లగా ఉంటుంది. మధ్యాహ్న సమయంలో కొబ్బరినీరు తాగితే శరీరానికి చాలా ఉల్లాసం లభిస్తుంది.అలాగే ఆహారంలో ఉపయోగించే జీలకర్ర మన అంతర్గత ఆరోగ్యాన్ని బాగా మెరుగుపరుస్తుంది. అందుకోసం కాచి చల్లారిన నీటిలో నానబెట్టిన జీలకర్ర నీరు లేదా రెండు చిటికెల జీలకర్ర వేసి మరిగించిన నీరుని మీరు త్రాగవచ్చు.ఇది మన శరీరానికి కావాల్సిన చాలా చల్లదనాన్ని ఇవ్వడంతో పాటు జీర్ణ సమస్యలను కూడా చాలా ఈజీగా నయం చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: