ఆరోగ్యం,అందం కోసం పాలలో ఇది కలిపి తాగండి?

Purushottham Vinay
ఈ రోజుల్లో చాలా మంది కూడా చిన్న వయసులోనే కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు వంటి సమస్యలతో చాలా ఎక్కువగా బాధపడుతున్నారు. అలా బాధ వారు మన ఇంట్లోనే ఉండే వివిధ రకాల పదార్థాలను పాలల్లో కలిపి తీసుకోవడం వల్ల ఖచ్చితంగా ఇలాంటి అనారోగ్య సమస్యలను చాలా ఈజీగా దూరం చేసుకోవచ్చు. అలాగే శక్తిని, బలాన్ని కూడా పొందవచ్చు.ఈ పాలను ఎవరైనా తాగవచ్చు. ఈ పాలను ఏ విధంగా తయారు చేసుకుని వాడడం వల్ల మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.ఇక ఈ టిప్ తయారు చేసుకోవడానికి మనం ఒక గ్లాస్ పాలను, ఒక టీ స్పూన్ సోంపు గింజలను ఇంకా అలాగే ఒక ఇంచు అల్లం ముక్కను ఉపయోగించాల్సి ఉంటుంది.ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ పాలను తీసుకుని వాటిని వేడి చేయాలి. ఆ పాలు వేడయ్యాక సోంపు గింజలను అలాగే అల్లం ముక్కలను కూడా వేయాలి. వీటిని అలాగే ఒక 5 నిమిషాల పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత వీటిని వడకట్టుకుని ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి.ఆ తరువాత ఇందులో రుచి కోసం తేనెను లేదా పటిక బెల్లాన్ని వేసి కలిపి తాగాలి.పంచదారను మాత్రం అస్సలు ఉపయోగించకూడదు. ఇలా తయారు చేసుకున్న పాలను తాగడం వల్ల కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు ఇంకా అలాగే ఆర్థరైటిస్ వంటి సమస్యలు తగ్గుతాయి.


ఎముకలు కూడా బాగా ధృడంగా తయారవుతాయి. అలాగే శరీరానికి తగినంత శక్తి లభించి నీరసం ఇంకా అలసట వంటి సమస్యలు తగ్గుతాయి. రోజంతా చాలా ఉత్సాహంగా ఉంటారు.ఈ విధంగా పాలను తయారు చేసుకుని తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అలాగే మనం ఎలాంటి ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటాము. ఇంకా అలాగే రక్తహీనత సమస్య కూడా ఈజీగా తగ్గుతుంది. ఈ పాలను తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ కూడా బాగా మెరుగుపడుతుంది. రక్తనాళ్లాల్లో అడ్డంకులు కూడా ఈజీగా తొలగిపోతాయి. ఈ విధంగా పాలను తయారు చేసుకుని వాడడం వల్ల చర్మ ఆరోగ్యం కూడా బాగా మెరుగుపడుతుంది. పాలు, సోంపు ఇంకా అలాగే అల్లంలో ఉండే ఔషధ గుణాలు కూడా చక్కటి ఆరోగ్యాన్ని అందిస్తాయి. ఇలా తయారు చేసుకున్న పాలను రాత్రి నిద్రపోవడానికి అరగంట ముందు మీరు తాగాలి. ఈ విధంగా పాలను తయారు చేసుకుని తాగడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని ఇంకా అలాగే అలాగే అందాన్ని సొంతం కూడా చేసుకోవచ్చు. ఇంకా అనారోగ్య సమస్యలను మన దరి చేరుకుండా కూడా చూసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: