శ్వాసకోశ వ్యాధుల బారిన పడకుండా కొన్ని జాగ్రత్తలు?

Purushottham Vinay
ఇక శ్వాసకోశ వ్యాధుల బారిన పడకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకొని వాటిని పాటిస్తే సరిపోతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా ఆయుర్వేదంలో శ్వాసకోశ వ్యాధులు రాకుండా చాలా రకాల పరిష్కారాలు ఉన్నాయి.అవేంటి ఇంకా అలాంటి చిట్కాలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.తులసి శ్వాసకోశ ఆరోగ్యానికి గొప్ప సంజీవని అని చెప్పవచ్చు. అందుకే ప్రతిరోజూ మూడు నుండి నాలుగు తులసి ఆకులను తినడం వల్ల ఇన్ఫెక్షన్లు, సైనసైటిస్, దగ్గు ఇంకా అలాగే జలుబు వంటి వివిధ శ్వాసకోశ వ్యాధులను చాలా ఈజీగా నివారించవచ్చు.ఇక ఇది శక్తివంతమైన ఇమ్యునోమోడ్యులేటర్ మాత్రమే కాదు. ఉబ్బసం అలాగే బ్రోంకైటిస్ చికిత్సలో కూడా బాగా ఉపయోగపడుతుంది.అలాగే తులసిలో బలమైన యాంటీవైరల్ లక్షణాలు కూడా ఉండటం విశేషం.ఇంకా అలాగే త్రిఫల అనేది ఆయుర్వేదంలో సర్వరోగనివారిణిగా చెబుతుంటారు. ఉసిరి, కరక్కాయ ఇంకా తానికాయల మిశ్రమమే త్రిఫల చూర్ణం. దీన్ని నీటిలో కలిపి నోట్లో వేసుకొని పుక్కిలించడం ద్వారా గొంతు ప్రాంతంలో సమస్య కలిగించే బ్యాక్టీరియా కూడా చాలా ఈజీగా చనిపోతుంది.ప్రతి రోజు ఇలా చేయడం ద్వారా శ్వాసకోశ వ్యాధులు రాకుండా చాలా ఈజీగా అడ్డుకోవచ్చు.


ఇంకా అలాగే ఊపిరితిత్తులను శుభ్రపరచడంలో నువ్వుల నూనె చాలా అద్భుతమైనది. ఉదయం పూట లేవగానే ముక్కు రంధ్రాల్లో రెండు చుక్కల నూనె వేయండి.ఎందుకంటే ఈ చుక్కలు మీ నాసికా మార్గాన్ని శుభ్రపరుస్తాయి.కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్ పాటించండి.అలాగే తేనె యాంటీ బ్యాక్టీరియా లక్షణాలతో అమృతం లాంటి రుచిని కలిగి ఉంటుంది. ప్రతిరోజూ తేనెను తీసుకోవడం ద్వారా శరీరానికి కావాల్సిన యాంటీఆక్సిడెంట్లు అనేవి చాలా ఈజీగా లభిస్తాయి.అలాగే తేనెలోని యాంటీ బాక్టీరియల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఊపిరితిత్తులను శుభ్రపరచడంలో చాలా బాగా సహాయపడతాయి.ఇంకా పిప్పల చూర్ణం సాధారణ శ్వాసకోశ సమస్యల చికిత్సలో అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇంకా ఇది యాంటీ ఇరిటెంట్‌గా పనిచేసి వాపును ఈజీగా తగ్గిస్తుంది. అలాగే ఊపిరితిత్తుల్లో  వుండే శ్లేష్మం క్లియర్ చేస్తుంది. ముక్కు దిబ్బడను కూడా తగ్గిస్తుంది.అలాగే పసుపు, శొంఠి, దాల్చిన చెక్క పొడిని రోజూ తీసుకోవడం మీ ఊపిరితిత్తులను క్లియర్ చేయడానికి ఒక చక్కటి పరిష్కారం. అందుకే ఈ మూడింటిని సమపాళ్లలో కలిపి ఉదయం, సాయంత్రం తీసుకుంటే శరీరానికి ఖచ్చితంగా చాలా మేలు చేకూరుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: