మీ చర్మాన్ని వైట్ గా బ్రైట్ గా మార్చే హోం రెమెడీ ఇదే..!!

Divya
ప్రస్తుత కాలంలో చాలామంది బిజీ పనుల వల్ల తమ చర్మాన్ని ఆరోగ్యంగా చూసుకోలేకపోతున్నారు. అంతేకాదు తీసుకునే ఆహారంలో లోపాలు .. సరైన వ్యాయామం లేకపోవడం లాంటి ఇతర కారణాల వల్ల కూడా చర్మం వదులుగా మారిపోయి కాంతి విహీనంగా మారిపోతుంది. ఇలాంటి అప్పుడు తిరిగి అందమైన చర్మాన్ని పొందాలని ప్రతి ఒక్కరు ఆరాటపడుతూ ఉంటారు. ఈ క్రమంలోని ఇప్పుడు చెప్పబోయే ఒక చిన్న హోమ్ రెమెడీని మీరు పాటించినట్లయితే.. ఇది మీ స్కిన్ ను వైట్ గా బ్రైట్ గా అలాగే టైట్ గా మార్చడం ఖాయం.. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఫేస్ టోనర్ ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం.
ముందుగా ఒక బౌల్ తీసుకొని.. అందులో ఐదు టేబుల్ స్పూన్ బియ్యాన్ని వేయాలి.. అలాగే ఒకటిన్నర గ్లాసు నీటిని పోసి బాగా మిక్స్ చేసి రాత్రంతా నానబెట్టాలి. అప్పుడప్పుడు రైస్ వాటర్ ను సపరేట్ చేయాలి.  ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి అందులో రైస్ వాటర్ వేసి హీటెక్కాక నాలుగు లవంగాలు, కొన్ని ఎండిన గులాబీ రేకులు ఒక టేబుల్ స్పూన్ గ్రీన్ టీ పౌడర్ వేసి పది నుంచి 12 నిమిషాల పాటు ఆ నీటిని బాగా మరిగించాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరిగించిన వాటర్ ని ఫిల్టర్ సహాయంతో వేరే జార్లో వెయ్యాలి. చల్లారిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ గ్లిజరిన్ వేసి బాగా మిక్స్ చేస్తే మనం ఫేస్ ఓనర్ సిద్ధం అయినట్లే.
మీరు ఒక బాటిల్ లో నింపుకొని రిఫ్రిజిరేటర్ లో స్టోర్ చేసుకోవచ్చు.. ఉదయం స్నానం చేయడానికి గంట ముందు నైట్ నిద్రించడానికి ముందు ఈ టోనర్ను దూది సహాయంతో ముఖానికి అప్లై చేసి శుభ్రం చేసుకోవాలి రోజుకు రెండుసార్లు ఇలా కొన్ని వారాలు పాటు వాడినట్లయితే మీ చర్మం అందంగా తెల్లగా తయారవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: