ఒక్క గ్లాస్ మజ్జిగ తో ఈ రోగాలన్నీ పరార్..!

Divya
మజ్జిగ శరీర తాపాన్ని తగ్గించి శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. రోజులో ఎక్కువసార్లు మజ్జిగ తీసుకోవడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. మజ్జిగా మన దాహార్తిని తీర్చడమే కాకుండా,శరీరానికి అవసరమయ్యే సోడియం,కాల్షియంను అందిస్తుంది. మజ్జిగ గుండె సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. బీపీ తగ్గించడంతోపాటు కొలెస్ట్రాల్ ను  నివారిస్తుంది. శరీరానికి హాని చేసే వ్యర్ధాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. శరీరంలో ఏర్పడే వేడిని తగ్గిస్తుంది.అలానే ఎముకలను బలంగా చేస్తుంది.
మనం తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం అయ్యేందుకు సహాయపడుతుంది.ఇది శరీరంలో మెటబాలిజం రేటును పెంచి తద్వారా బరువు తగ్గేందుకు దోహదపడుతుంది. కడుపులో ఏర్పడే అజీర్తి మరియు ఎసిడిటీ సమస్యలను తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.నేడు చాలామంది అధిక బరువు మరియు ఉబకాయంతో బాధపడుతున్నారు. అలాంటి వారు మజ్జిగలో ఒక టీ స్పూన్ తేనెను కలిపి ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవాలి.దీనిని క్రమం తప్పకుండా సుమారు రెండు నెలల పాటు తీసుకోవడం ద్వారా ఊబకాయం సమస్యను తగ్గించుకోవచ్చు.
మజ్జిగ అన్నంలో మామిడి పండ్లను కలిపి తినడం వల్ల విటమిన్ ఎ మరియు డి శరీరానికి అధిక మోతాదులో అందుతాయి.అలానే పలచని మజ్జిగలో నిమ్మ రసం, ఉప్పు కలిపి పిల్లలు, పెద్దలు అందరు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది.ముందుగా పావు కప్పు పెరుగును ఒక పాత్రలోకి తీసుకుని ఒక గ్లాసు నీళ్లు కలపాలి. ఉప్పు,  జీలకర్రపొడిని వేయాలి. బ్లెండర్తో ఆ మిశ్రమాన్ని పూర్తిగా కలపుతూ పలచగా చేసుకోవాలి. ఈ ఆయుర్వేద మజ్జిగను భోజనంతో పాటు లేదా.. భోజనం తరువాత తీసుకోవడం వలన  మంచి ఫలితం ఉంటుంది. అసలే వేసవి కాలం మొదలు కాబోతోంది.. ఇలాంటి సమయం లో శరీరం డీ హైడ్రేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ.. కాబట్టి సరైన సమయంలో నీటిని ఎక్కువగా. తీసుకోవాలి. లేదా నీటికి బదులు పల్చటి మజ్జిగ తాగడం వల్ల చల్లదనం తో పాటూ ఇతర సమస్యలు కూడా దూరం అవుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: