పిక్కలు పట్టేస్తున్నాయా? అయితే ఇలా చెయ్యండి?

Purushottham Vinay
కాళ్లకు రక్తప్రసరణ అనేది సరిగ్గా జరగకపోయినా ఇంకా అలాగే వెన్నుపూస దగ్గర నరాలపై ఒత్తిడి ఎక్కువగా ఉన్న కూడా  పిక్కలు పట్టేస్తూ ఉంటాయి. అలవాటు లేని వ్యాయామాలు చేసినా కూడా ఈ విధంగా జరుగుతుంది. ఇంకా అదే విధంగా శరీరంలో పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం ఇంకా సోడియం వంటి లవణాలు తగ్గినప్పుడు కూడా ఈ సమస్య ఎక్కువగా తలెత్తుతుంది. అలాగే ధూమపానం అలవాటు ఎక్కువగా ఉన్నవారిలో ఈ సమస్య చాలా ఎక్కువగా వస్తుంది.కాళ్ళు, పిక్కలు నొప్పి పుట్టి తీవ్రంగా ఉండి ఇబ్బంది పెడుతున్నప్పుడు వేడి నీటితో కాపడం పెట్టుకోవాలి. లేదంటే వేడి నీటితో స్నానం చేయాలి. ఇంకా అలాగే ఇలా పిక్కలు పట్టేసినప్పుడు కాలును కొద్దిగా పైకి ఎత్తి పాదాన్ని కిందికి పైకి కదిలించడం వల్ల కూడా కొంచెం ఉపశమనం అనేది కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంకా అలాగే నోట్లో కొద్దిగా ఉప్పు వేసుకోవడం వల్ల కూడా ఈ నొప్పి నుండి ఈజీగా ఉపశమనం కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


 ఇంకా అలాగే ప్రతిరోజూ బొప్పాయి, చిలగడ దుంప, పుచ్చకాయ, ఖర్బూజ, గుమ్మడికాయ ఇంకా అలాగే అరటి పండు వంటి వాటిని ఖచ్చితంగా తీసుకోవాలి. అదే విధంగా శరీరం డీ హైడ్రేషన్ కు గురి కాకుండా నీటిని కూడా ఎక్కువగా తాగుతూ ఉండాలి.ముఖ్యంగా పొద్దున పూట వ్యాయామం చేస్తూ ఉండాలి.చక్కటి జీవనశైలి, వ్యాయామం ఇంకా చక్కటి ఆహారాన్ని తీసుకున్నా కూడా ఈ సమస్య మిమ్మల్ని పదే పదే వేధిస్తూ ఉంటే ఖచ్చితంగా వైద్యున్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. ఈ పిక్కలు పట్టేయడం అనేది సాధారణ సమస్యే అయినా అందరిలో వచ్చే సమస్యే అయినా దీనిని మాత్రం మీరు నిర్లక్ష్యం చేయకూడదు. తరచూ పిక్కలు పట్టేయడం అలాగే కండరాలు చాలా సేపటి దాకా సాధారణ స్థితికి రాకపోవడం ఇంకా అలాగే పిక్కలు పట్టేసి కాళు బలహీనంగా అయ్యి నడవలేని స్థితి రావడం వంటి వాటిని గుర్తిస్తే వెంటనే డాక్టర్ ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం అవసరమని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: