గొంతులో కిచ్ కిచ్ గా వుందా.. అయితే ఇలా చేయండి..!

Divya
సాధారణంగా దగ్గు లేదా జలుబు చేసినప్పుడు గొంతులో కిచ్ కిచ్ గా అనిపిస్తుంది.. అలాంటప్పుడు వీలైనంత త్వరగా చెక్ పెట్టాలి.. అందుకు వైద్యుల వద్దకు వెళ్లాల్సిన పనిలేదు.. మీ ఇంటి దగ్గర నుంచి చక్కగా దీనిని మీరు అదుపు చేయవచ్చు.. మరి ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. గొంతులో కిచికిచ్ సమస్య చిన్నదే కానీ దానివల్ల కలిగే ఇబ్బంది మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది.. మాటిమాటికి గొంతు సవరించుకోవడం.. తన్నుకొస్తున్న దగ్గును మింగలేక.. కక్కలేక పడే అవస్థలు అన్ని ఇన్నీ కావు అని చెప్పవచ్చు.  ఒకవేళ వైద్యుడు దగ్గరికి వెళ్దామా అంటే అంత తీవ్రతగా కూడా లేదని అనిపిస్తూ ఉంటుంది.
అయితే దీర్ఘకాలంగా మాత్రం దీనిని ఉంచినట్లయితే సమస్య మరింత తీవ్రతరం అవుతుంది. శరీరంలోకి ఏదైనా బ్యాక్టీరియా ప్రవేశించినప్పుడు వాటిపై మన శరీరంలోని వ్యాధి నిరోధక శక్తి తప్పకుండా పోరాడుతుంది ఈ క్రమంలోని కఫం లేదా శ్లేష్మం అనేది ఏర్పడుతుంది. అప్పుడు అది గొంతుకి అడ్డం పడి గొంతులో గరగరా అనిపిస్తుంది.  నిజానికి జ్వరం,  జలుబు,  అలర్జీలు,  పొగ , కాలుష్యం వంటివి గొంతు గరగరకు దారితీస్తాయని వైద్యులు చెబుతున్నారు ముఖ్యంగా సాధ్యమైనంత వరకు దీనికి త్వరగా చెక్ పెట్టాలట.
సమస్యగా ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవాలి ఇది సహజ ఆరోగ్య  రిఫ్రెషర్ గా పనిచేస్తుంది.  చాలా కాలం నుంచి ఫ్లూ లక్షణాలు , గొంతు నొప్పి , దగ్గు వంటి వాటికి చికిత్స చేయడానికి వైద్యులు దీనిని సిఫార్సు చేస్తారు.. తేనె కూడా గొంతు నొప్పి ని తగ్గించడానికి ఇతర సహజ పదార్థాలతో కలిపి మీరు దీనిని ఉపయోగించవచ్చు ఇన్ఫెక్షన్లతో పోరాడడంతో పాటు నొప్పి నివారణకు కూడా సహాయపడుతుంది. కాబట్టి తేలు తీసుకున్న సరే గొంతులో గరగర అనిపించడం తగ్గిపోతుంది. అలాగే ఉప్పునీటితో పుక్కిలించడం వల్ల కూడా సమస్య తగ్గిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: