బరువు పెరిగి హుషారుగా ఉండాలంటే..?

Purushottham Vinay
ఇప్పుడు చెప్పబోయే లడ్డులు ఆరోగ్యానికి చాలా మంచిది. వీటి వల్ల శరీరానికి తగినంత శక్తి లభిస్తుంది. బరువు పెరగాలనుకునే వారు ఈ లడ్డూలను తినడం వల్ల చాలా ఈజీగా ఇంకా ఆరోగ్యంగా బరువు పెరుగుతారు. ఇంకా అలాగే ఈ లడ్డూలను షుగర్ వ్యాధి గ్రస్తులు కూడా భయం లేకుండా తినవచ్చు. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ లడ్డూలను సులభంగా ఇంకా రుచిగా ఎలా తయారు చేసుకోవాలి? వంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.ముందుగా ఒక జార్ తీసుకొని అందులో ఎండుకొబ్బరి ముక్కలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఆ తరువాత ఖర్జూరం ముక్కలను వేసి పొడిగా మిక్సీ పట్టుకుని వాటిని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత మిగిలిన డ్రై ఫ్రూట్స్ ను ఇంకా అలాగే యాలకులను వేసి మిక్సీ పట్టుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పొడులన్నింటిని కూడా ఒక కళాయిలో వేసి చిన్న మంటపై ఒక 5 నిమిషాల పాటు కలుపుతూ బాగా వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి.ఆ తరువాత అదే కళాయిలో గోధుమపిండి కూడా వేసి వేయించాలి.


అలా గోధుమపిండిని 2 నిమిషాల పాటు వేయించిన తరువాత కొద్ది కొద్దిగా నెయ్యి వేస్తూ ఇంకా కలుపుతూ వేయించాలి.గోధుమపిండి రంగు మారి పలుచగా అయ్యే దాకా నెయ్యి వేస్తూ వేయించాలి. ఇలా వేయించిన తరువాత దీనిని ముందుగా సిద్దం చేసుకున్న డ్రై ఫ్రూట్ మిశ్రమంలో వేసి బాగా కలపాలి.తరువాత అదే కళాయిలో 2 టీ స్పూన్ల నెయ్యి కూడా వేసి వేడి చేయాలి. ఆ తరువాత బెల్లం తురుము వేసి కొంచెం వేడి చేయాలి. బెల్లం ఉండలు పూర్తిగా కరిగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి దీనిని  లడ్డూ మిశ్రమంలో వేసి కలపాలి. ఆ తరువాత మిగిలిన నెయ్యిని కూడా అందులో వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఇది అంతా కలిసిపోయేలా బాగా కలిపిన తరువాత వీటిని లడ్డూలుగా చుట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల చాలా రుచిగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి మేలు చేసే లడ్డూలు కూడా తయారవుతాయి. వీటిని రోజుకు ఒకటి లేదా రెండు చొప్పున తినడం వల్ల మన ఆరోగ్యానికి ఖచ్చితంగా చాలా మేలు కలుగుతుంది.పిల్లలకు ఈ లడ్డూలను తినిపించడం వల్ల వారిలో ఎదుగుదల కూడా చక్కగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: