శృంగార సామర్థ్యాన్ని పెంచే లవంగాలు.. ఎలా వాడాలంటే..?

Divya
ప్రస్తుతం ప్రకృతి ప్రసాదించిన ఆయుర్వేదం పైనే మళ్లీ ప్రజలు ఆధారపడుతున్నారు. ఈ క్రమంలోనే మనకు వంటింట్లో లభించే అతికొద్ది సుగంధ ద్రవ్యాలలో లవంగం కూడా ఒకటి.. దీనిని వంటలకు మంచి రుచిని అందించడానికి కాదు పరిమళాలను అందించడానికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు కానీ ఈ లవంగాల అసలు ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మాత్రం తప్పకుండా వాడకుండా వదిలేయరు అని చెప్పవచ్చు. ఇకపోతే లవంగాల వల్ల ముఖ్యంగా పురుషులలో శృంగారం సామర్థ్యాన్ని పెంచడానికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందడానికి కూడా లవంగాలను ఉపయోగిస్తూ ఉంటారు. ఇకపోతే లవంగాలను మనం కొన్ని ప్రత్యేక పద్ధతులలో తీసుకోవడం వల్ల కొన్ని రకాల సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు..
వయసు పైబడిన కొద్దీ కీళ్ల నొప్పులు సహజంగా వస్తూ ఉంటాయి.  అలా  కీళ్ల నొప్పులు ఉన్నవారికి లవంగం నూనె చాలా బాగా పని చేస్తుంది. మీకు ఈ లవంగం నూనే అందుబాటులో లేకపోతే లవంగాన్ని మెత్తగా  నూరి పేస్టులా చేసి నొప్పి ఉన్నచోట ఆ పేస్టును అప్లై చేస్తే వెంటనే నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.లవంగంలో ఉండే యూజెనాల్  అనే లక్షణము మన కాలేయ ఆరోగ్యాన్ని సంరక్షించేందుకు దోహదపడుతుంది. కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. అలానే కాలేయ ఆరోగ్య పోషణకు దగ్గరగా ఉండే మంచి కొవ్వులను అందిస్తుంది.కనుక కాలేయం లో ఏర్పడే మంటను తగ్గించి , కాలెయానికి మంచి ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది.
లవంగాలు పురుషుల్లో కామోద్దీపనం కలిగిస్తాయి. శృంగారంలో పాల్గొనే ముందు ఒక లవంగం మొగ్గను తింటే, అవి శరీరాన్ని వేడెక్కించి,మీ భాగస్వామితో తారస్థాయిలో శృంగారంలో పాల్గొనేలా చేయడంతో పాటు, ఎక్కువసేపు శృంగారం జరిపేందుకు దోహదపడతాయి. అంతేకాదు మగవారిలో స్ప్రెమ్ క్వాంటిటీ పెంచడానికి కూడా ఇవి చక్కగా పనిచేస్తాయి కాబట్టి సంతాన ఉత్పత్తిని కూడా అధికంగా కలిగి ఉంటాయి. కాబట్టి లవంగాలను మీరు తగిన రీతిలో తీసుకున్నట్లయితే తప్పకుండా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: