ఈ టేస్టీ టీ తాగితే ఏ జబ్బులు రావు?

Purushottham Vinay
ఈ చలికాలంలో ఖచ్చితంగా శరీరంలో రోగనిరోధక శక్తి బాగా బలహీనపడుతుంది. కానీ ఇప్పుడు చెప్పబోయే ఈ టీ తాగడం వల్ల ఖచ్చితంగా రోగనిరోధక శక్తి త్వరగా పెరుగుతుంది. కొబ్బరి టీలో విటమిన్ సి ఇంకా యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. ఈ రోజుల్లో ప్రజల ఆహారపు అలవాట్లు అనేవి బాగా చాలా చెడిపోయాయి.దీంతో గుండె జబ్బుల వంటి సమస్యలు చాలా తీవ్రమవుతున్నాయి. అందుకే కొబ్బరి టీ HDL కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది.అధిక రక్తపోటును నియంత్రించడంలో కూడా ఇది ఎంతగానో సహాయపడుతుంది.ఇక కొబ్బరి టీలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. నీటి కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే కొబ్బరి టీ తాగడం వల్ల చాలా ఈజీగా బరువు తగ్గుతారు. ఇక మీరు కూడా బరువు అదుపులో ఉంచుకోవాలనుకుంటే..ఖచ్చితంగా ఈ టీని రోజూ తాగండి.అంతేకాకుండా కొబ్బరి టీలో కొవ్వు ఇంకా యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నందు వలన చర్మానికి చాలా ఉపయోగకరంగా పనిచేస్తుంది.


దీంతో చర్మ సంబంధిత సమస్యలు చాలా ఈజీగా దూరమవుతాయి.కొబ్బరి టీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..ఇక కొబ్బరి టీ తయారీకి కావలసిన పదార్ధాలు..3 కప్పుల నీరు, 1 కప్పు కొబ్బరి పాలు, 1/2 కప్పు హెవీ క్రీమ్, 2 బ్యాగ్‌ల గ్రీన్ టీ ఇంకా 1 టీస్పూన్ బ్రౌన్ షుగర్ తీసుకోవాలి.ఈ టీ రెడీ చేయడానికి ఒక గిన్నెలో నీటిని మరిగించండి. ఆ తరువాత అందులో గ్రీన్ టీ బ్యాగ్స్ వేయండి. దానికి కొబ్బరి పాలు వేసి హెవీ క్రీమ్‌ ని కలపాలి.ఈ పదార్థాలన్నింటినీ కూడా బాగా కలిసేలా కలపండి. టీ బ్యాగ్‌లను బయటకు తీసేసి రుచిని మరింత పెంచుకోవటం కోసం బ్రౌన్ షుగర్ ని కూడా యాడ్‌ చేసుకోండి.కొబ్బరి టీ తాగడం వల్ల బరువు తగ్గి, చర్మం, గుండె సమస్యలకు సహాయపడుతుంది.అంతేగాక కొబ్బరి టీ మీ శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.అలాగే కొబ్బరి టీ అద్భుతమైన రుచిని కలిగి ఉంటుంది. ముఖ్యంగా శీతాకాలంలో కొబ్బరి టీ చాలా ప్రభావవంతంగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: