చికెన్ ఎక్కువగా లాగిస్తే తిప్పలు తప్పవట?

Purushottham Vinay
చికెన్లో వుండే మ్యాజిక్ వేరు. దాని వాసన చూస్తేనే నోట్లో లాలాజలం ఊరుతుంది. అంత రుచికరంగా ఉంటుంది. అయితే వారానికి ఒకటి రెండుసార్లు తింటే పర్లేదు. కొంతమందికి మాత్రం చికెన్ ముక్క లేనిదే ముద్ద దిగదు. ఎందుకంటే ఇందులో ప్రొటీన్ కంటెంట్‌ అనేది అధికంగా ఉంటుంది. ప్రతి రోజూ దీన్ని తినడం వల్ల కొవ్వు రూపంలో మారి శరీరంలో బాగా పేరుకుపోతుంది. అందువల్ల క్రమంగా బరువు పెరుగుతారు. అలాగే గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. రక్తంలో లిపిడ్ స్థాయిలు కూడా ఈజీగా పెరిగిపోతాయి. చికెన్ వంటి అధిక ప్రోటీన్ ఆహారాలను అతిగా తినడం వల్ల గుండె సంబంధ వ్యాధుల ప్రమాదం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఆయువు క్షీణించి అకాల మరణం సంభవిస్తుంది. పచ్చి చికెన్‌పై సాల్మొనెల్లా ఇంకా క్యాంపిలోబాక్టర్ వంటి బ్యాక్టిరియాలు ఉంటాయి.


చికెన్‌ను ముట్టుకుంటే అవి చేతులకు అంటుకుని పొట్ట లోనికి పొయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు.ఇంకా అలాగే పౌల్ట్రీ రైతులు కోళ్లకు ఇచ్చే యాంటీబయోటిక్ ఇంజెక్షన్ల వల్ల.. ఆ చికెన్ తినేవారిలో యాంటీబయోటిక్స్ నిరోధకత అనేది బాగా పెరిగిపోతుంది. ఇక ఆ తర్వాత ఏదైనా అనారోగ్యం తలెత్తితే వైద్యులు సూచించే మందులు వారి శరీరాలపై అంతగా ప్రభావం కూడా చూపవు.అందువల్ల బ్రాయిలర్ కోళ్లను తినడం కంటే నాటు కోళ్లు తింటే ఆరోగ్యానికి ఎంతో కొంత మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.అది కూడా ప్రతి రోజూ కాకుండా వారానికి రెండు లేదా మూడు సార్లు తినమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి రోజూ తినే అలవాటు ఉంటే మాత్రం ఖచ్చితంగా పద్ధతి మార్చుకోవల్సిందేనని ఆరోగ్య నిపుణులు హెచ్చిరిస్తున్నారు.ఇక చేపలు తర్వాత ఆరోగ్యకరమైన ఆహారం ఏంటంటే మాంసం. దీన్ని వారానికి రెండు సార్లు తిన్నా చాలు మన శరీరానికి అవసరమైన ప్రొటీన్లు చాలా పుష్కలంగా అందుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: