ఒళ్ళు నొప్పులు తగ్గాలంటే..?

Purushottham Vinay
చాలా మందిని కూడా ఒళ్ళు నొప్పులు ఎంతగానో వేధిస్తాయి. నొప్పులతో పాటు నీరసం, అలసట, నిద్రలేమి, ఏ పని మీద కూడా దృష్టి పెట్టలేకపోవడం, నెగెటివ్ ఆలోచనలు ఎక్కువవడం, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండడం ఇతర సమస్యలు కూడా చాలా మందికి తలెత్తుతాయి. ఇంకా కండరాల నొప్పులు కూడా ఎక్కువవుతాయి. ఈ సమస్య నుండి బయటపడానికి చాలా మంది  ఉపశమనం కోసం మందులను వాడుతూ ఉంటారు. అయితే మందులతో పనిలేకుండా ఈ చిట్కా పాటించడం వల్ల ఈ సమస్య నుండి చాలా ఈజీగా ఉపశమనం కలుగుతుందని  శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో వెల్లడైంది.అందుకు మీరు రోజుకు రెండు సార్లు మాత్రమే ఆహారాన్ని తినాలి. ఉదయం 10 గంటలకు ఒకసారి,సాయంత్రం 5 గంటలకొకసారి మాత్రమే మీరు భోజనాన్ని తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల నరాల్లో వచ్చే ఇన్ ప్లామేషన్ తగ్గి నొప్పులు ఈజీగా తగ్గుతున్నాయని ఆరోగ్య నిపుణులు వెల్లడించారు.


ఇంకా అలాగే ఉదయం పూట నీళ్లు తాగుతూ ఉండాలి. ఆ తరువాత 10 గంటలకు ఫ్రూట్ జ్యూస్ ను లేదా వెజిటేబుల్ జ్యూస్ ను ఖచ్చితంగా తాగాలి. ఇంకా 11 గంటలకు ఒకటి లేదా రెండు పుల్కాలను ఉప్పు ఇంకా నూనె లేని కూరలతో కలిపి తినాలి. ఇక మధ్యాహ్నం పూట నీళ్లు తాగుతూ ఉండాలి. అలాగే సాయంత్రం 4 గంటల సమయంలో ఒక గ్లాస్ ఫ్రూట్ జ్యూస్ ను మీరు తాగాలి. ఇక 5 గంటలకు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉండే చియా విత్తనాలను ఇంకా వాల్ నట్స్ ను తినాలి.ఇంకా అలాగే విటమిన్ ఇ ఎక్కువగా ఉండే పొద్దు తిరుగుడు పప్పు, బాదం పప్పు ఇంకా గుమ్మడి పప్పు వంటి వాటిని తీసుకుని ఏదైనా రెండు లేదా మూడు రకాల ఫ్రూట్స్ ను ఖచ్చితంగా తినాలి. రోజూ ఇలా ఆహారాన్ని తీసుకుంటూ తేలికపాటి వ్యాయామాలు చేస్తూ ఉండడం వల్ల ఒళ్ళు నొప్పులు తగ్గుతాయని ఇంకా రావని నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: