పాలల్లో ఇది కలిపి తాగితే షుగర్ రానే రాదు?

Purushottham Vinay
ప్రస్తుతం మనం రక్తంలో చక్కెర స్థాయులను పెంచే ఆహారాలను తెలిసో.. తెలియకో ఎక్కువగా తింటూ వున్నాం. దాని ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయులు అనేవి పెరగడం మాత్రమేకాకుండా చాలా రకాల అనారోగ్య సమస్యలకు కూడా ప్రత్యక్ష కారణం అవుతుంది. ముఖ్యంగా చలికాలంలో చాలా మంది కూడా బాగా బద్దకించి వ్యాయామం చేయడం మానేస్తుంటారు. శారీరక శ్రమ తగ్గడంతో జీవక్రియ అనేది ఖచ్చితంగా నెమ్మదిస్తుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయి కూడా మరింత ప్రభావితమవుతుంది. ఐతే కొన్ని రకాల సహజ మూలికలు ఇంకా అలాగే సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన ఈ పొడులను గ్లాసుడు పాలల్లో కలిపి తాగితే ఖచ్చితంగా బ్లడ్ లో షుగర్ లెవెల్‌ను నియంత్రణలో ఉంచుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.ఇక ధనియాలు అనేవి మన రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా నియంత్రిస్తాయి. దీనిలోని కార్భోహైడ్రేట్ జీవక్రియను మెరుగుపర్చడానికి ఇంకా హైపోగ్లైసీమిక్ చర్యను పెంచడానికి ఎంతగానో సహాయపడతాయి. ధనియాలలో ఇథనాల్ అనేది చాలా పుష్కలంగా ఉంటుంది.


ఇది గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడానికి ఎంతగానో సహాయడుతుంది. అలాగే గ్లాసుడు వేడి పాలల్లో దాల్చిన చెక్క పొడిని చిటికెడు కలిపి తాగడం వల్ల రక్తంలో గ్లూకోజ్ అనేది 18 నుంచి 29 శాతం దాకా తగ్గుతుంది.ఇంకా అలాగే నీళ్లలో నానబెట్టిన 10 గ్రాముల మెంతులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటీస్ ఖచ్చితంగా నియంత్రణలో ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం పూట లేదా రాత్రిపూట నిద్రపోయే ముందు మెంతులు నానబెట్టిన నీటిని తాగడం వల్ల టైప్ 2 డయాబెటీస్ పేషెంట్ల రక్తంలో చక్కెర స్థాయిలను ఇంకా అదే విధంగా కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.కాబట్టి ఖచ్చితంగా ఇలా చెయ్యండి. షుగర్ వ్యాధి రాకుండా బ్లడ్ లెవెల్స్ ని కంట్రోల్ లో పెట్టుకోండి. సంపూర్ణ ఆరోగ్యంగా వుండండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: