డార్క్ చాక్లెట్స్ తింటే ఈ భయంకర వ్యాధులు మాయం?

Purushottham Vinay
డార్క్ చాక్లెట్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతాయట.ఎందుకంటే ఈ డార్క్ చాక్లెట్స్ లోని కొన్ని సమ్మేళనాలు, ప్రత్యేకంగా ఫ్లేవనోల్స్, గుండె జబ్బులకు రెండు ప్రధాన ప్రమాద కారకాలైన అధిక రక్తపోటు ఇంకా అలాగే అధిక కొలెస్ట్రాల్‎ను ప్రభావితం చేస్తుంది. అలాగే ఈ డార్క్ చాక్లెట్ రక్త సరఫరాను మెరుగుపరచడంతోపాటు, రక్తం గడ్డకట్టకుండా కూడా ఎంతగానో సహాయపడుతుంది. అందుకే వారానికి రెండు లేదా మూడుసార్లు ఈ డార్క్ చాక్లెట్ తింటే రక్తపోటును ఈజీగా అధిగమించేలా ఇది చేస్తుంది.అలాగే డార్క్ చాక్లెట్‎తో డిప్రెషన్‎కు కూడా ఈజీగా చెక్ పెట్టవచ్చు. రోజుకు 24గ్రాములు లేదా అంతకంటే తక్కువ డార్క్ చాక్లెట్ ని తినడం వల్ల యాంటిడిప్రెసెంట్ ప్రభావం తగ్గుతుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. ఇది ఫ్లేవనాయిడ్స్‎ను కూడా బాగా మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే థియో‎బ్రోమిన్ శరీరానికి కావాల్సిన శక్తిని కూడా అందిస్తుంది. ఎన్-ఎసిల్ ఇథనోలమైన్స్ ( యూఫోరిక్ ప్రభావాన్ని కలిగి ఉండే కొవ్వు ఆమ్లం) ఫెనిలేథైలమైన్ ( డోపమైన్ ను ప్రేరేపిస్తుంది) ఇవన్నీ కూడా డిప్రెషన్ నుంచి చాలా ఈజీగా మీకు ఉపశమనం కలిగిస్తాయి.


ఇంకా అలాగే ఈ డార్క్ చాక్లెట్ లో ఫాలిఫెనాల్స్ కూడా చాలా పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరిచే యాంటీఆక్సిడెంట్ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటాయి. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఎంతగానో సహాయపడతాయి.అలాగే అధిక బరువు సమస్యతో బాధపడేవారు డార్క్ చాక్లెట్ తింటే ఖచ్చితంగా చాలా మంచి ఫలితం ఉంటుంది. ఇది బరువును తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది. ఇందులో ఉండే మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు బరువును తగ్గించడంతోపాటు జీవక్రియను కూడా బాగా మెరుగుపరుస్తాయి. అంతేకాదు కేలరీలను కూడా చాలా వేగంగా వేగంగా బర్న్ చేస్తుంది. భోజననానికి ఒక 20 నిమిషాల ముందు తింటే కోరికలను కూడా ఈజీగా అరికడుతుంది. డార్క్ చాక్లెట్‎లో ఉండే మెగ్నీషియం ఇంకా యాంటీ ఆక్సిడెంట్లు శరీర నొప్పుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి. బరువు తగ్గాలనుకునేవారికి డార్క్ చాక్లెట్ అనేది చాలా బెస్ట్ ఎంపిక అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: