చుండ్రుకి ఇలా శాశ్వతంగా చెక్ పెట్టొచ్చు?

Purushottham Vinay
చుండ్రు వల్ల తలలో దురద, మంట వంటి పలు సమస్యలు ఎక్కువగా వస్తాయి. అంతేకాకుండా కొంతమందిలో జుట్టు చాలా బలహీనంగా  మారుతుంది. దాని ఫలితంగా జుట్టు రాలడం వంటి సమస్యలు ఎక్కువగా పెరుగుతాయి. కాబట్టి ఇలాంటి సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి చుండ్రును తగ్గించుకోవడానికి పెరుగును జుట్టుకు అప్లై చేయాల్సి ఉంటుంది. పెరుగులో జుట్టు కావాల్సిన క్యాల్షియం ఇంకా అలాగే జింక్ వంటి మూలకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇది చుండ్రును తగ్గించి అన్ని రకాల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అయితే జుట్టు దృఢత్వం కోసం చుండ్రును నియంత్రించుకోవడానికి పెరుగును ఎలా వాడాలో మనం ఇప్పుడు మనం తెలుసుకుందాం..జుట్టు బలంగా ఇంకా అలాగే ఆరోగ్యంగా ఉండటానికి ఇంకా చుండ్రు సమస్య నుంచి సులభంగా బయటపడటానికి పెరుగుతో పాటు నిమ్మకాయ రసాన్ని కలిపి జుట్టుకు రాయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు పొందవచ్చని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు.


పెరుగులో ఉండే యాంటీ ఫంగల్ గుణాలు జుట్టు స్కాల్ప్ ఇన్ఫెక్షన్‌లను తొలగించడానికి ఎంతగానో సహాయపడతాయి. అలాగే నిమ్మకాయలో విటమిన్ సి ఇంకా సిట్రిక్ యాసిడ్ ఉండడం వల్ల చాలా రకాల జుట్టు సమస్యలను  తొలగించవచ్చు.ఇంకా అంతేకాకుండా ఈ టిప్ జుట్టును రూట్ నుంచి చాలా బలంగా చేస్తుంది.ఇంకా మీరు చుండ్రు సమస్యతో ఎక్కువగా బాధపడుతున్నట్లయితే తప్పకుండా జుట్టుకు పెరుగును వాడాల్సి ఉంటుంది. పెరుగులో లాక్టిక్ యాసిడ్ అనేది పుష్కలంగా ఉంటుంది. ఇది వెంట్రుకల రూట్స్‌ నుంచి చుండ్రును తొలగించడంలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ కూడా జుట్టుకు పెరుగును అప్లై చేయాల్సి ఉంటుంది. అయితే ఈ క్రమంలో కేవలం పుల్లని పెరుగును మాత్రమే వాడాల్సి ఉంటుంది.పెరుగుని అప్లై చేసి 20 నుంచి 25 నిమిషాల పాటు జుట్టుకు ఉంచి శుభ్రం చేయడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితాలు పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: