చిన్న వయసులోనే గ్రే హేయర్ తో బాధపడుతున్నారా..ఈ చిట్కాలను వాడండి..!!

Divya
ఈరోజుల్లో ఆహారపు అలవాట్లు, వాతావరణ పరిస్థితుల కారణంగా చిన్నవయసులోనే జుట్టు తెల్లబడుతోంది. దీంతో యూత్ చాలా ఇబ్బంది పడుతున్నారు. దీని కోసం రకరకాల షాంపూలు, నూనెలు వాడినా ,ఏ ప్రయోజనం లేక విసిగుచెందుతున్నారు. అలాంటి వారికోసం ఈ చిట్కాలు చాలాబాగా పనిచేస్తాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
గోరింటాకు పొడి..
 ఒక గ్లాస్ నీటిలో గోరింటాకుపొడి,ఒక స్ఫూన్ పెరుగు, ఒక స్ఫూన్ ధనియాపౌడర్ , ఒక స్ఫూన్ మెంతిపొడి , కాఫీపొడి వేసి, స్టవ్ పై బాగా వుండికించి, రాత్రంతా అలా నిల్వ ఉంచాలి. మరుసటి రోజు ఉదయం జుట్టు కుదుళ్ళు నుంచి చివరి వరకు అప్లై చేసి,గంట తర్వాత మైల్డ్ షాంపూతో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేసుకోవడం వల్ల తొందరగా జుట్టును నల్లగా మార్చుకోవచ్చు.
ఉసిరిప్యాక్..
ఉసిరికాయపొడి మరియు మజ్జిగ మిశ్రమం తెల్ల జుట్టును ఈజీగా నల్లబరుస్తుంది. దీనికోసం ఉసిరిపొడిని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని దాన్ని పావు కప్పు మజ్జిగలో వేసి రాత్రంతా నానబెట్టాలి. మరుసటిరోజు ఆ మిశ్రమాన్ని తలకు పట్టించి, గంట తర్వాత శుభ్రంగా తలస్నానం చేయాలి.ఇలా తరుచు చేయడం వల్ల జుట్టు నల్లగా నిగనిగలాడుతుంది.
బ్లాక్ టీ పౌడర్..
జుట్టును నల్లగా మార్చడంలో బ్లాక్ టీ బాగా సహాయపడుతుంది. బ్లాక్ టీ పౌడర్ ని నీటిలో కలిపి,ఈ మిశ్రమాన్ని నెమ్మదిగా తలకు బాగా మర్దన చేయాలి. దానిని అరగంట పాటు అలాగే ఉంచి,తలను గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇలా వారానికి రెండుసార్లు చేయడం వల్ల, జుట్టు తొందరగా నల్లబడుతుంది.
కరివేపాకు పొడి..
కరివేపాకు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని అందరికీ తెలిసినదే. ఒక పిటికడు కరివేపాకును తీసుకొని అందులో ఒక స్పూన్ నిమ్మరసం, ఒక కప్పు పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి, ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా తరుచు చేయడం వల్ల తెల్లగా ఉన్న జుట్టు నల్లగా మారుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: