జిల్లేడు యొక్క ప్రయోజనాలు తెలిస్తే షాక్..!

Divya
తెల్ల జిల్లేడును శ్వేతార్కం అని అంటారు . వృక్షజాతిలో తెల్లజిల్లేడు చాలా విశిష్టమైనది. అయితే దీనిని అనేక అపోహల కారణంగా ఎవరు ఇంటి పరిసరాల్లో కూడా ఉంచుకునేకి ఇష్టపడేవారు కాదు.కానీ జిల్లేడును.. వాటి దివ్య ఔషధాలను తయారు చేస్తారని మనలో చాలామందికి తెలియదు. ఈ చెట్టును చాలా మంది పవిత్రంగా భావించి ఇంట్లో నాటుతూ ఉంటారు. జిల్లేడు చెట్టు ఇంట్లో ఉంటే  ధనధాన్యాలు పుష్కలంగా ఉంటాయని నమ్ముతారు . మన ఆలోచనలు పరిపక్వత, ఎటువంటి దృష్ట ప్రభావాలు  మనపై పడకుండా జిల్లేడు మనలని రక్షిస్తుందని భావిస్తారు.
జిల్లేడు లోని ప్రతిభాగం అనగా... ఆకులు,కాండం మరియు వేర్లు మరియు పూలు అన్ని అద్భుతమైన ఔషధ విలువలు కలిగి ఉన్నాయి. ఆయుర్వేదంలో జిల్లేడును రసాయన గుణాలతో కూడిన ఔషధమని నమ్ముతారు. అయితే జిల్లేడు పాలని మాత్రం కంటికి దూరంగా ఉంచుకోవాలి. లేదంటే కంటికి చాలా ప్రమాదం అయితే జిల్లేడు వాడకం మరియు తీసుకునే మోతాదులకు ఆయుర్వేద నిపుణులు సలహా తప్పనిసరిగా తీసుకోవాలి.సొంత ప్రయత్నాలు చేయడం ఏమంత మంచిది కాదు.
ముఖంపై ఏర్పడే మచ్చలు, ముడతల నివారణలో జిల్లేడు అద్భుతంగా పనిచేస్తుంది.జిల్లేడు చూర్ణాన్ని ఈ మొక్క యొక్క పాలతో కలిపి ముఖంపై ఏర్పడే నల్లటి మచ్చలు మరియు ముడతలపై అప్లై చేసుకోవడం ద్వారా మచ్చలు మరియు ముడతలు  తగ్గుముఖం పడుతాయి.అయితే ఇలా ముఖానికి అప్లై చేసేటప్పుడు మాత్రం కంటికి ఈ మిశ్రమం తగలకుండా జాగ్రత్తపడాలి. లేదంటే కంటిచూపుకు హాని జరిగే ప్రమాదం ఉందని మన పెద్దలు చెబుతూ ఉంటారు.
పూర్వకాలంలో వైద్యులు ఈ జిల్లేడు మొక్కను విశిష్ట రూపాల్లో వాడేవారు.ఈ చెట్టు యొక్క ఆకులను తీసుకుని దానికి నువ్వుల నూనె మరియు ఉప్పును వేడి చేసి ఆ రసాన్ని  రోగి చెవులో చుక్కలుగా వేస్తే చెవుకి సంబందించిన సమస్యలు సమిసిపోతాయని చెప్తారు. నడుము నొప్పితో బాధపడేవారు ఈ ఆకులకు ఆవాల నూనెను రాసి పెనంపై వేడిచేసి నడుము లేదా వాపు ఉన్న శరీర ప్రాంతాల్లో కట్టుగా కట్టుకుంటే ఎంతో ప్రభావంతో పనిచేస్తుంది.
దంత సమస్యలతో బాధపడేవారు.  దీని పాలను దూదితో ముంచి దంతాలపై ఉంచితే మంచి ప్రభావాన్ని పొందవచ్చు. అలాగే దీని వేరును చిన్న చిన్న ముక్కలుగా కోసి అల్లం రసం కలిపి చిన్న చిన్న గులకల రూపంలో తీసుకుంటే అతిసారం నుండి బయటపడవచ్చు. జిల్లేడు ఆకులను చిన్న చిన్న ముక్కలుగా కోసి,వేడి నీటిలో వేసి ఉడికించి తీసుకోవడం ద్వారా గొంతు మరియు నోటి సమస్యలను తగ్గిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: